🔴 Live News: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 15, 2025 15:51 IST

    BREAKING: అఘోరి అరెస్ట్.. కారుతోపాటు ఈడ్చుకెళ్లిన పోలీసులు!

    తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సంచలనం రేపుతున్న అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పహిల్వాన్ దర్గాను తొలగించాలనే డిమాండ్‌తో జోగులాంబ ఆలయానికి వెళ్తున్న నాగసాధువును ఉండవల్లి బైరాపురం వద్ద పోలీసులు అడ్డుకుని కారుతోపాటు ఈడ్చుకెళ్లారు. 

    aghori
    aghori Photograph: (aghori )

     



  • Mar 15, 2025 10:00 IST

    హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

    హోలీ వేడుకల్లో ఆకతాయిలు రసాయనాలు కలిపిన రంగులను విద్యార్థినులపై చల్లారు. దీంతో వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి వచ్చాయి. వెంటనే 8 మంది బాలికలను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్వర్‌లో జరిగింది.

    chemical laced Holi colours
    chemical laced Holi colours Photograph: (chemical laced Holi colours)

     



  • Mar 15, 2025 09:59 IST

    హోలీ వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అనేక మందికి గాయాలు

    జార్ఖండ్‌లో జరిగిన హోలీ వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఒకరిపైకి ఒకరు రాళ్లు విసురుకోవడంతో పాటు దుకాణాలకు నిప్పు అంటించారు. కొన్ని షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి.

    Jharkhand crime
    Jharkhand crime Photograph: (Jharkhand crime)

     



  • Mar 15, 2025 09:58 IST

    బెదిరింపు కాల్స్ వచ్చేవి.. టీమ్ ఇండియా క్రికెటర్ వరుణ్

    ఛాంపియన్స్ ట్రోఫీలో తన బౌలింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. మూడు మ్యాచ్ లలో తొమ్మిది వికెట్లు తీసిన వరుణ్ కు 2021 నుంచి ఓ రెండేళ్లు చాలా కష్టంగా గడిచాయిట. బెదిరింపు కాల్స్ వచ్చేవని చెబుతున్నాడు వరుణ్. వివరాలు కింద ఆర్టికల్ లో..

    cricket
    Varun Chakravarthy

     



  • Mar 15, 2025 09:57 IST

    TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి

    కర్నూల్‌లో శుక్రవారం రాత్రి టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. కర్నూలులోని శరీననగర్‌లో మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి అయిన కోశపోగు సంజన్న(55)ని మర్డర్ చేశారు. గుడికి వెళ్లి వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.

    kurnool murder
    kurnool murder Photograph: (kurnool murder)

     



  • Mar 15, 2025 09:57 IST

    పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టని ప్రకాశ్‌రాజ్.. Xలో సెటైర్ల వర్షం

    పవన్ కళ్యాణ్ తమిళనాడు హిందీ వివాదంపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎప్పటి లాగే జస్ట్ ఆస్కింగ్ అంటూ వపన్‌పై సెటైర్లు వేశారు. హిందీ మా మీద రుద్దకండని అంటే మరోభాషను ద్వేషించడం కాదని ఆయన అన్నారు. ఇది పవన్‌కు చెప్పడని Xలో పోస్ట్ చేశారు.

    pk with prakash raj
    pk with prakash raj Photograph: (pk with prakash raj)

     



  • Mar 15, 2025 09:56 IST

    ఏలియన్స్ ఉన్నాయి.. అమెరికా నిఘా అధికారులు

    ఏలియన్స్ ఉన్నాయా లేదా అనేది ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఎవ్వరూ కచ్చితంగా చూసింది లేదు. కానీ యూఎఫ్ వోలు, గ్రహాంతరవాసుల గురించి కథలు మాత్రం కోకొల్లలు. తాజాగా అమెరికా వెటరన్స్ కూడా ఏలియన్స్ ఇక్కడే భూమి మీద ఉన్నరంటూ నమ్మకంగా చెబుతున్నారు.

    usa
    Aliens

     



  • Mar 15, 2025 09:55 IST

    కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్

    కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై 12 రౌండ్లు కాల్పులు జరిగాయి. హిమచల్ ప్రదేశ్‌ బిలాస్‌పూర్‌లో నివాసముంటున్న మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని నలుగురు దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయనతోపాటు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

     



  • Mar 15, 2025 09:54 IST

    కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి

    కాకినాడలో ఉంటున్న చంద్రశేఖర్ కన్న పిల్లలను దారుణంగా చంపేశాడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని పిల్లలను కట్టేసి బకెట్‌ నీటిలో ముంచి చంపేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లేఖ రాయడంతో ఈ విషయం బయటపడింది.

    Kakinada crime
    Kakinada crime Photograph: (Kakinada crime)

     



  • Mar 15, 2025 09:41 IST

    రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

    బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్న కన్నడ నటి రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. సీబీఐ దర్యాప్తు వేళ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.ఎఫ్‌ఐఆర్‌ లో నిందితుల పేర్లు రాసేందుకు కేటాయించిన కాలమ్‌ ను దర్యాప్తు సంస్థ బ్లాంక్‌ గా ఉంచినట్లు సమాచారం.

    Ranya Rao
    Ranya Rao

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు