Latest News In Telugu Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి తుమ్మల TG: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ప్రాజెక్టు గండి కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శిస్తారు. బాధిత రైతాంగానికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించనున్నారు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: పెద్దవాగు ఎఫెక్ట్.. ప్రభుత్వం హైఅలర్ట్..! ఖమ్మం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ అయింది. అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల సామర్థ్యం, క్రస్ట్ గేట్ల పనితీరుపై నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దిగువ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains : ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవులు! ఏపీ- తెలంగాణలో గడిచిన రెండు రోజుల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు IMD తెలిపింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బంగాళాఖాతంలో వాయుగుండం...తెలంగాణ పై ఎంత ప్రభావం అంటే! తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.తెలంగాణపై దీని ప్రభావం శనివారం భారీగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Runa Mafi: రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ TG: రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించిన రేవంత్ సర్కార్ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లోన్ రెన్యూవల్ చేసుకున్న అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని సూచించారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Peddavagu Project: హైటెన్షన్.. కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టుకు గండి TG: కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టుకు నిన్న రాత్రి గండి పడింది. దీంతో ప్రాజెక్ట్‌లోని నీళ్లు మొత్తం ఖాళీ అయ్యాయి. వరద ప్రవాహంతో అశ్వారావుపేట మండలం నారాయణపురం బ్రిడ్జిపై 40 మంది చిక్కుకున్నారు. వీరందరిని ఎయిర్ బోట్లతో సురక్షిత ప్రాంతానికి తరలించారు సహాయక సిబ్బంది. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: భద్రాద్రిని ముంచిన వరద భద్రాద్రిలో వరద పోటెత్తింది. ఒక్కసారిగా వర్షపునీరు ముంచెత్తడంతో ఇందులో 28 మంది కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఢీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని కూలీలను రక్షించారు. తెలంగాణ, ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: వరదల్లో చిక్కుకున్న 30 మంది.. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు..! భద్రాద్రి జిల్లా నారాయణపురం కట్ట మైసమ్మ గుడి వద్ద వరదలో చిక్కుకున్న 30 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో తరలిస్తున్నారు. పరిస్థితిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దగ్గరుండి సమీక్షిస్తున్నారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AP: వరదల్లో చిక్కుకున్న రైతు కూలీలు, పశువుల కాపరులు..! భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రైతు కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. ఎగువ కురిసిన వర్షాలకు పెదవాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. సమాచారం లేకపోవడంతో రైతు కూలీలు, పశువుల కాపరులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn