/rtv/media/media_files/2025/03/15/c6XH10Zi63wdbTSV844k.jpg)
Mallu Bhatti Vikramarka
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ ఆందోళనల సందర్భంగా స్టూడెంట్స్ పై పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. సంయమనం పాటించాలని, విద్యార్థులపై దుందుడుకుగా వెళ్లవద్దని పోలీసులకు సూచించారు. ఈ రోజు ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బిల్లి రావుకు 400 ఎకరాల భూమిని అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు.
అభివృద్ధి కోసమే ఆ భూములను వినియోగిస్తాం..
అనంతరం 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపులను రద్దు చేశామన్నారు. తమ న్యాయపోరాటంతో తెలంగాణ ప్రభుత్వానికి ఆ భూములు దక్కాయన్నారు. అభివృద్ధి కోసమే ఆ భూములను వినియోగిస్తామని స్పస్టం చేశారు. హైటెక్ సిటీని విస్తరిస్తామన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వారు ఇతరులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
(hcu | telugu-news | latest-telugu-news | telugu breaking news)
MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
mla-rajasingh cases
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. శోభాయాత్రలో రాజాసింగ్ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్‌పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.
ముస్లింలకు వ్యతిరేకం కాదు
వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు.
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
BIG BREAKING: ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ తల్లి కన్నుమూత
Canada: కెనడా రాజకీయాల్లో కొత్త ట్రెండ్
BIG BREAKING: తైవాన్‌లో భారీ భూకంపం
శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!
USA: కలలు కల్లలుగానే మిగిలిపోతాయా..ఆందోళనలో అమెరికా విద్యార్థులు