/rtv/media/media_files/2025/04/05/RX6weqS5SK8Aoj1I1hD2.jpg)
Maoist party
Maoist party : ఐదు రాష్ట్రాల్లోని దండకారణ్యాల్లో భద్రతా బలగాలు వరుస ఎన్‌కౌంటర్లతో మావోలు ఆత్మస్థైర్యం కోల్పొతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఓవైపు భధ్రతాబలగాలు అడవులను జల్లెడపడుతుండటం మరోవైపు ఆకురాలు కాలం కావడంతో సేఫ్ జోన్లు లేక మావోలు లొంగుబాటువైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ నేతల ప్రొటెక్షన్ కమాండర్లు ఉన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఈ మేరకు ఇవాళ తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 86 మంది మావోయిస్టులు పోలీస్ బెటాలియన్ కార్యాలయంలో ఐజీ (IG) ఎదుట సరెండర్ అయ్యారు. వారంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ దళ సభ్యులని పోలీసులు వెల్లడించారు. లోంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.
Also Read: America Trump:ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!
అయితే, ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లు.. పక్కా బూటకపు ఎన్‌కౌంటర్లు అంటూ ఈ నెల 3న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఓ లేఖను విడు దల చేసింది. అందులో కార్పొరేట్ దోపిడీని సులభతరం చేసేందుకు కేంద్రం దేశంలో మావోయిస్టుల నరమేధానికి తెరలేపారని ఆక్షేపించారు. ఆదివాసీలు, విప్లవకారులు ఈ నర సంహారాన్ని వెంటనే ఆపాలని తాము చర్చలకు సిద్ధం అంటూ లేఖలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లోంగిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్!
ఓవైపు సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేస్తూనే మరోవైపు సరెండర్ల వైపు తెలంగాణ పోలీసుల దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈఏడాది నాలుగు నెలల వ్యవధిలో 224 మంది మావోల సరెండర్ కాగా 70 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. భధ్రాధ్రికొత్తగూడెం పోలీస్ యూనిట్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహణ, మావోల సరెండర్లలో కీలకపాత్ర పోషిస్తున్నది.తెలంగాణలో త్వరితగతిన ప్రభుత్వం సరెండర్ పాలసీ అమలు చేస్తుండటం లొంగిపోయిన మావోలకు పునారావాసం, ఉపాధికల్పనపై దృష్టిసారించండం సత్ఫలితాలిస్తుందని తెలంగాణ మల్టీజోనల్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న ఇన్ స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్ రెడ్డి, భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సరెండర్ అయిన మావోల వివరాలు వెల్లడించారు.
వార్‌జోన్‌గా మారిన దండకారణ్యం
ఇదిలాఉంటే దండకారణ్యం వార్ జోన్‌గా మారింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అబూజ్‌మడ్ అడవులే టార్గెట్‌గా జనవరి నుంచి జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. ఏప్రిల్ 16వ తేదీన జరిగిన కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తరువాత జరిగిన కోర్చోలి ఎన్‌కౌంటర్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 11వ తేదీన బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోలు చనిపోయారు. నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో 10 మంది, నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది ఇలా వందలాదిమంది మావోలు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మావోలు. ఆదివాసీ నివాస ప్రాంతాలపై చాపర్లతో డ్రోన్‌లతో బాంబింగ్ చేస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో నరమేధం సాగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!
Also Read: America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!
86 #Maoists from #Chattisgarh , including 4 ACMs Surrender in #Telangana
— Surya Reddy (@jsuryareddy) April 5, 2025
A total of 86 members belonging to the banned CPI (#Maoist) from the neighbouring Chhattisgarh Surrendered to the Police in #Bhadradri #Kothagudem district of Telangana on Saturday, the IGP, Multi Zone I… pic.twitter.com/HwAejwTSCp