/rtv/media/media_files/2025/04/06/ieArgzInDRujrr3MfJL6.jpg)
Bhadrachalam Temple
Bhadrachalam Temple : భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకులకు ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఆనావాయితీ ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన తర్వాత నుంచే వస్తుందనుకుంటారు. కానీ నిజానికి దీనికి 135 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అంటే నిజాం పాలన నుంచే ఆ ఆచారం కొనసాగుతోంది. 1890లలో ఆరో నిజాం కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. మిథిలా మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రతి ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు. నిజాం కాలం నుంచే మత సామరస్యానికి ప్రతీకగా.. భద్రాచలం రాములవారి కల్యాణానికి సర్కార్ నుంచి కానుకలు అందేవి. 1890లలో హైదరాబాద్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి బృందం ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ తరపున భద్రాచలం ఆలయానికి కానుకలు సమర్పించారు. ఈ సంప్రదాయం కుతుబ్ షాహీలతో ప్రారంభమై నేటికీ తెలంగాణ ప్రభుత్వం ద్వారా కొనసాగుతోంది.
Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి నిజాం నవాబులు కానుకలు అందించిన చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు కూడా ఉన్నాయి. నిజాం రాజవంశం, ముఖ్యంగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన దాతృత్వంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా నిలిచారు. ఆయన మత విశ్వాసాలకు అతీతంగా హిందూ, ముస్లిం దేవాలయాలకు, ఇతర సంస్థలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. భద్రాచలం ఆలయానికి సంబంధించి నిజాం రాజులు ఈ పుణ్యక్షేత్రాన్ని గౌరవించారు. ఆలయ నిర్వహణకు ఆర్థిక సహాయం కూడా అందించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భద్రాచలం ఆలయానికి రూ. 29,999 విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ సొమ్ము ఆ కాలంలో చాలా ఎక్కువ అని దాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగించినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
అంతేకాకుండా భక్త రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న ప్రజాధనాన్ని రాములవాడి దేవాలయ నిర్మాణానికి వెచ్చించి గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానాషా చేత ఖైదు చేయబడినప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు రామదాసుకు రుణం తీర్చడానికి రామముద్రలతో బంగారు నాణేలు అందించారని పురాణ కథనం ఉంది. ఈ సంఘటన తర్వాత, తానాషా రామదాసును విడుదల చేసి ఆలయానికి గ్రామాలను దానం చేసినట్లు చెబుతారు. ఈ గ్రామాల ఆదాయం ఆలయ నిర్వహణకు ఉపయోగపడింది. ఆ తర్వాత కాలంలో నిజాం రాజులు భద్రాచలం ఆలయం చుట్టూ ఉన్న భూముల ద్వారా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయి. అలా మొదలైన ఈ ఆనవాయితీ ఉమ్మడి రాష్ర్టంలోనూ కొనసాగింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి.
An official delegation of #Hyderabad state in 1890s presenting offerings to #Bhadrachalam temple on behalf of Nizam VI. The tradition started with the Qutub Shahis and continues even today by Telangana govt. #SriRamNavami pic.twitter.com/QMPcnXLhJl
— Syed Akbar (@SyedAkbarHYD) April 6, 2025