/rtv/media/media_files/2025/01/23/tpfHYYAXJwl96YEalMeC.jpg)
Infosys
Infosys Jobs: ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్.. తెలంగాణలో మరింత విస్తరించనుంది. ఇందుకోసం స్విట్జర్లాండ్‌లో దావోస్(Davos) వేదికగా జరిగిన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే పోచారంలో ఉన్న క్యాంపస్‌ను విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీనివల్ల మరో 17 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు పేర్కొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ జయేష్ సంఘ్‌రాజ్ భేటీ అయ్యారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
సమావేశం ముగిసిన అనంతరం జయేష్ ఈ ప్రకటన చేశారు. పోచారం క్యాంపస్ విస్తరణలో(Infosys IT Campus Expansion in Pocharam) భాగంగా మొదటి దశలో రూ.750 కోట్ల పెట్టబడితో మరికొన్ని కొత్త ఐటీ భవనాలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇవి పూర్తయ్యేందుకు మరో రెండు లేదా మూడేళ్లు పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణను ఐటీ రంగంలో మొదటి స్థానానికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Also Read: ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో హాస్పిటళ్లకు క్యూ కడుతున్న ఇండియన్స్
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో కూడా భేటీ అయ్యారు. దాదాపు రూ.60వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్.. తమ డేటా సెంటర్‌లను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలో క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్(Amazon Web Services) ఇప్పటికే ప్రకటించింది.
Also Read: బ్యాంకుకు రూ.19 కోట్లు ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నేత
అలాగే విప్రో కంపెనీ కూడా హైదరాబాద్‌లోని గోపనపల్లిలో మరో ఐటీసెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి.. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన చేశారు.
Also Read : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!