Husband Killed Wife: ప్రియుడే కావాలన్న భార్య.. కానిస్టేబుల్‌ ముందే గొంతుకోసిన భర్త

ఫేస్‌బుక్‌లో  ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం వారి సంసారంలో చిచ్చు పెట్టింది. ప్రియుడి మోజులోపడి భర్తను,పిల్లల్నివదిలేసి అతడితో వెళ్లిపోయిందా ఇల్లాలు. కోపంతో భర్త కత్తితో దాడిచేయడంతో మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

New Update
FotoJet (2)

siddareddy -kavitha-pavan kumar reddy

ఫేస్‌బుక్‌(facebook) లో  ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం వారి సంసారంలో చిచ్చు పెట్టింది. ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న భర్తను, కన్నపిల్లల్ని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందా ఇల్లాలు. ఆ కోపంతో భర్త కత్తితో దాడిచేయడంతో మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ దారుణం సంగారెడ్డి జిల్లా(zaheerabad-sangareddy) సదాశివపేట మండలం నందికంది సమీపంలో చోటుచేసుకుంది. జహీరాబాద్‌(Zaheerabad Incident) పట్టణ సీఐ, ఎస్సైలు శివలింగం, వినయ్‌కుమార్‌ తెలిపిన ప్రకారం..ఝరాసంగం మండలం తుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన సిద్ధారెడ్డి(35), కవిత(29) భార్యాభర్తలు. వీరికి  12 ఏళ్ల కింద వివాహమైంది. వారిద్దరూ జహీరాబాద్‌లో అద్దెకుంటున్నారు. అక్కడే సిద్ధారెడ్డి పానీపూరి బండి నడుపుతుండగా కవిత టైలరింగ్‌ పనిచేస్తోంది. వారి దాంపత్యానికి గుర్తుగా  తొమ్మిదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా పదేళ్ల క్రితం ఆమెకు తిరుపతి జిల్లా తిరుపతి మండలం చంద్రగిరికి చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(32)తో ఫేస్‌బుక్‌లో పరిచయమై, ఆ పరిచయడం సాన్నిహిత్యానికి దారితీసింది. కాగా పవన్‌ కుమార్‌ రెడ్డి  మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో నివాసం ఉంటున్నాడు.

Also Read :  తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త

Husband Ki*ll*s Wife Throat In Front Of Constable

ఇలా ఉండగానే కవిత మార్చి 27న అర్ధరాత్రి ఆమె భర్త, కూతురు,కుమారుడిని వదిలేసి జడ్చర్ల(jadcherla) లో ఉంటున్న పవన్‌కుమార్‌రెడ్డి వద్దకు వెళ్లిపోయింది. మరునాడు ఉదయం లేచి చూసేప్పటికీ భార్య కనిపించకపోవడంతో అంతటా వెతికిన సిద్ధారెడ్డిఆ చివరికి 28న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా కవిత జడ్చర్లలో ఉన్నట్లు తెలిసింది. ఆదివారం ఆమెను జహీరాబాద్‌ తీసుకొచ్చేందుకు కానిస్టేబుల్‌ ఖదీర్, భర్త సిద్ధారెడ్డి కారులో జడ్చర్లకు వెళ్లారు. ఇద్దరినీ జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన కానిస్టేబుల్‌ అక్కడ వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అక్కడే భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో  పోలీసులు సిద్ధారెడ్డిని కొంత సేపు బయట వేచి ఉండమని చెప్పడంతో అతను బయటకు వెళ్లిపోయాడు. దగ్గరలో కూరగాయలు కోసే కత్తిని కొనుగోలు చేసి సిద్ధారెడ్డి దాన్ని తన వద్ద దాచుకున్నాడు. తర్వాత పోలీసులు ముగ్గురికి సర్ధిచెప్పినప్పటికీ వినకపోవడంతో జహీరాబాద్‌ స్టేషన్‌ లో కేసు నమోదైనందున అక్కడికే వెళ్లాలని పోలీసులు సూచించారు. వెంటవచ్చిన కానిస్టేబుల్‌ వారి ముగ్గురిని తీసుకుని జహీరాబాద్‌ బయలు దేరారు. కారులో సిద్ధారెడ్డి, కవిత, పవన్‌.. కారు వెనక సీటులో కూర్చొగా.. కానిస్టేబుల్‌, డ్రైవర్‌ ముందు సీట్లో ఉన్నారు. ఈ క్రమంలోనే తనను పిల్లలను వదిలేసి వెళ్లిపోవడంతో పాటు తన పరవుతీసిందన్న కోపంతో కారు నందికంటి వద్దకు రాగానే కవితపై సిద్ధారెడ్డి ఒక్కసారిగా కత్తితో దాడి చేసి గొంతు, తలపై పొడిచాడు.

ముందు సీట్లో ఉన్న కానిస్టేబుల్‌ వెంటనే స్పందించి కారు ఆపి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాసేపట్లో జహీరాబాద్‌ చేరుకుంటామనేలోగానే సిద్ధారెడ్డి కవిత గొంతు, మెడపై పొడవటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే కానిస్టేబుల్‌ అప్రమత్తమై కారును సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్‌కు సూచించాడు. కానీ అక్కడికి చేరేలోపే కవిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పంచనామా అనంతరం సోమవారం కవిత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కాగా, జహీరాబాద్‌, జడ్చర్ల పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారు ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా ఓ ప్రాణం దక్కేదని అంటున్నారు. కాగా,  సిద్ధారెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్‌ పోలీసులు వివరించారు.  

Also Read :  యుద్ధం ఎఫెక్ట్ :  మందుబాబులకు బిగ్ షాక్.. పెరగనున్న బీరు రేటు..!

Advertisment
తాజా కథనాలు