/rtv/media/media_files/2025/04/03/lWoXtAsJu6hDIlHObxhs.jpg)
_repair damaged bricks Photograph: (_repair damaged bricks)
చంద్రమండలంపై మానవ మనుగడ గురించి ప్రస్తుతం అధ్యాయనాలు జరుగుతున్నాయి. ఒకవేళ చంద్రుడిపై మనుషుల నివాసం సాధ్యమైతే.. అక్కడ నిర్మాణాలు చేయడానికి ఇటుకలు కావాలి. అంతేకాదు మూన్ మీద ఉన్న వైవిధ్య ఉష్ణోగ్రతల కారణంగా ఇటుకలు బీటలువారే ప్రమాదముంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. చంద్రునిపై వాతావరణం కఠినంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఒక్కరోజులో 121 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగి.. మైనస్ 133 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతూ ఉంటుంది. అంతేకాక తీక్షణమైన సౌర పవనాలు, తోకచుక్కలు అక్కడ నిత్యకృత్యమే. అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో స్పోరోసార్సినా పాశ్చరీ అనే బ్యాక్టీరియాను ఉపయోగించడం వల్ల ఇటుకల్లో పగుళ్లును నియంత్రించడానికి ఓ పదార్థాన్ని కనుగొన్నారు. అది కూడా చంద్రుడిపై ఉండే బ్యాక్టీరియాతో తయారు చేశారు.
Also read: Emergency landing: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
#JUSTIN #Space #Update #Moon
— Chethan Kumar (@Chethan_Dash) April 1, 2025
In fresh progress relating to lunar brick development for future lunar habitation, researchers at #IISc have successfully created a bacteria-based technique to repair damaged bricks intended for lunar construction. 1/n
Pic: IISc pic.twitter.com/HTe2L3N6c8
Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం
ఇటుకల్లో పగుళ్లు నివారించేందుకు బ్యాక్టీరియాను ఉపయోగించే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను ఫ్రాంటియర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీస్ అనే జర్నల్‌లో ప్రచురించారు. అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో స్పోరోసార్సినా పాశ్చరీ అనే బ్యాక్టీరియాను ఉపయోగించడం ద్వారా తీవ్ర తాపం వల్ల ఇటుకల్లో కలిగే పగుళ్లను నివారించవచ్చని పరిశోధకులు నిరూపించారు. ఇందుకోసం వారు బ్యాక్టీరియా ద్రావకాన్ని, గోరుచిక్కుడు మొక్కలతో తయారుచేసిన జిగురును, చంద్రునిపై లభించే మట్టిలాంటి పదార్ధాన్ని ఉపయోగించి ఇటుకలు తయారుచేశారు. ఈ ప్రక్రియలో ఉపయోగించిన బ్యాక్టీరియా ఆ ఇటుకల తయారీలో ఉపయోగించిన కార్బొనేట్‌ను కాల్షియం కార్బొనేట్‌గా మారుస్తుంది.