Accenture: చేసే పనిలో AI వాడకపోతే.. ప్రమోషన్లు ఇవ్వమని ఉద్యోగులకు కంపెనీ వార్నింగ్‌

ఏఐ టూల్స్‌ను వినియోగించుకోవడంలో వెనుకబడిన వారికి ప్రమోషన్లు ఉండవని యాక్సెంచర్ స్పష్టం చేసింది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్ స్థాయి అధికారులకు కంపెనీ పంపిన ఇంటర్‌నల్ మెయిల్‌లో కీలక విషయాలను వెల్లడించింది.

New Update
Accenture warn

ప్రస్తుతం టెక్ ప్రపంచం ఒక కీలక మలుపులో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial-intelligence-technology) రాకతో కంపెనీల్లో వర్క్ కల్చర్ వేగంగా మారుతోంది. కేవలం పని చేయడం మాత్రమే కాదు, ఆ పనిలో ఏఐని ఎంత సమర్థవంతంగా వాడుతున్నారనేదే ఇప్పుడు జాబ్ సెక్యురిటీకి కొలమానంగా మారుతోంది. తాజాగా దిగ్గజ టెక్ సంస్థ యాక్సెంచర్ కంపెనీలో సీనియర్ ఉద్యోగులకు(employees) ఇచ్చిన వార్నింగ్ ఈ మార్పుకు నిదర్శనం.

యాక్సెంచర్ 'అల్టిమేటం'

ఏఐ టూల్స్‌ను వినియోగించుకోవడంలో వెనుకబడిన వారికి ప్రమోషన్లు ఉండవని యాక్సెంచర్(accenture) స్పష్టం చేసింది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్ స్థాయి అధికారులకు కంపెనీ పంపిన ఇంటర్‌నల్ మెయిల్‌లో కీలక విషయాలను వెల్లడించింది.

లీడర్‌షిప్ రోల్స్: భవిష్యత్తులో లీడర్‌షిప్ బాధ్యతలు చేపట్టాలంటే ఏఐ(ai) వినియోగం తప్పనిసరి.
ప్రమోషన్ల నిలిపివేత: ఏఐ స్కిల్స్ వాడని వారికి కెరీర్ వృద్ధి ఉండదని సంకేతాలిచ్చింది.
రీస్కిల్లింగ్: ఇప్పటికే ఏఐ వల్ల రీస్కిల్లింగ్ సాధ్యం కాని సుమారు 11 వేల మంది ఉద్యోగులను యాక్సెంచర్ తొలగించిన సంగతి తెలిసిందే.

Also Read :  AI రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.. 24 గంటల్లో 2.5 లక్షల ప్రతిజ్ఞలతో గిన్నిస్ రికార్డ్!

గూగుల్, మైక్రోసాఫ్ట్ బాటలోనే..

ఈ తరహా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది ఒక్క యాక్సెంచర్ మాత్రమే కాదు. టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. - it-companies

గూగుల్: ఏఐ టూల్స్(Artificial Intelligence) వాడకానికి అనుగుణంగా మారలేని వారు స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి తప్పుకోవచ్చని సూచించింది. వారికి ఆకర్షణీయమైన 'ఎగ్జిట్ ప్యాకేజీలను' కూడా ఆఫర్ చేసింది.

మైక్రోసాఫ్ట్: తన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే కెరీర్‌లో ఎదుగుదల ఉండదని తేల్చి చెప్పింది.

ఇతర సంస్థలు: అమెజాన్, మెటా వంటి సంస్థలు కూడా ఏఐ నైపుణ్యాలు లేని వారిని పక్కన పెట్టి, కొత్త టెక్నాలజీకి అలవాటు పడే వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి.

Also Read :  ఇండియా ఇజ్జత్ తీసిన యూనివర్సిటీ.. సోషల్ మీడియాలో చైనా డాగ్ రోబోట్ రచ్చ రచ్చ

ఎందుకు ఈ మార్పు?
కంపెనీలు కేవలం ఖర్చు తగ్గించుకోవడానికే కాకుండా, పనితీరులో వేగం, ఖచ్చితత్వం పెంచడానికి ఏఐని ఆశ్రయిస్తున్నాయి. సీనియర్ ఉద్యోగులు మార్పుకు సిద్ధంగా లేకపోతే, అది సంస్థ వృద్ధిపై ప్రభావం చూపుతుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి.

మొత్తానికి టెక్ పరిశ్రమలో లెర్న్ లేదా ఎగ్జిట్ అనే సూత్రం బలంగా అమలవుతోంది. కేవలం అనుభవం ఉంటే సరిపోదు, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకున్న వారికే భవిష్యత్తు ఉంటుందని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు