ఢిల్లీలో మంచు ఎఫెక్ట్.. రైళ్లు, విమానాలు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బీభత్సంగా పొగమంచు ఉండటం వల్ల వాహనాలు కనిపించడంలేదు. దీంతో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బీభత్సంగా పొగమంచు ఉండటం వల్ల వాహనాలు కనిపించడంలేదు. దీంతో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, యానాంలో వర్షాలు కురవనున్నాయి.తెలంగాణలో పలు జిల్లాల్లో మూడ్రోజులపాటు తేలికపాటి వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలుగు రాష్ట్రాలలో చలితీవ్రత రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఉదయం 10 అయినప్పటికీ కూడా చలితీవ్రత తగ్గడం లేదు. రెండు రాష్ట్రాల్లో చాలాచోట్ల రాత్రి పూట ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల స్థాయికి పడిపోయాయి.
రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్లో రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్, చేతులకు గ్లౌజ్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కేవలం వేడి పదార్థాలు తీసుకోవడంతో పాటు స్నానం కూడా వేడి నీరుతో చేయాలని నిపణులు అంటున్నారు.