Andhra Pradesh: రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా రానున్న రెండురోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దాదాపు ఏపీ అంతటా వర్షాలు పడతాయని చెప్పింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా రానున్న రెండురోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దాదాపు ఏపీ అంతటా వర్షాలు పడతాయని చెప్పింది.
రానున్న ఐదురోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం వరకు వరంగల్, హన్మకొండ, కరీంనగర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 106మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాని వల్ల కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్ అన్నీ జలమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.జమ్మూ, కశ్మీర్,హర్యానా, చండీగడ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి అల్పపీడన గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తూర్పు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో అల్పస్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయని తెలిపారు.