Winter Season: పంజా విసురుతున్న చలి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్‌లో రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్, చేతులకు గ్లౌజ్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కేవలం వేడి పదార్థాలు తీసుకోవడంతో పాటు స్నానం కూడా వేడి నీరుతో చేయాలని నిపణులు అంటున్నారు.

New Update
Weather Alert: రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న చలి.. జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగిపోతుంది. రోజురోజుకీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇంతటి చలిలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ చలి నుంచి బయట పడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. 

ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

చల్లని పదార్థాలు అసలు తీసుకోవద్దు..

చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతుంది. కాబట్టి రాత్రి, ఉదయం వేళలలో ఎక్కువగా బయటకు వెళ్లవద్దు. వాకింగ్ చేసే వారు ఉదయం 7 గంటలు లేదా 8 గంటల తర్వాత ఎండ సమయాల్లో చేయడం మంచిది. ఈ కాలంలో అసలు చల్లని పదార్థాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ఐస్ క్రీమ్, జ్యూస్‌లు వంటివి తీసుకోవద్దు. చల్లని ఆహారం కంటే వేడిగా ఉండే ఆహారాలని మాత్రమే తినాలి. 

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

రాత్రి లేదా ఉదయం సమయాల్లో బయటకు వెళ్తే.. చేతులకు గ్లౌజ్, స్వెటర్ తప్పకుండా వేసుకోవాలి. చెవుల్లోకి గాలి వెళ్లకుండా కప్పుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ కాలంలో చల్లని నీటితో అసలు స్నానం చేయవద్దు. గోరువెచ్చగా ఉండే నీటితో స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్తమా సమస్య ఉన్నవారు అయితే అసలు బయటకు వెళ్లకూడదు. వేడి నీరు మాత్రమే తాగాలి. 

ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చూడండి:  తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు