Ap Rains: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల గతకొంత కాలంగా వానలు ఎక్కువగా కురుస్తున్నాయి. ఏపీలో చాలా రోజులుగా వానలు కురుస్తుండగా... ప్రస్తుతం బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. Also Read: Manmohan : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి..7 రోజులు సంతాప దినాలు అయితే అది బలహీనపడి అల్పపీడనంగా మారడంతో. 1.5 కిలో మీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు సమాచారం. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడుతున్నాయని అధికారులు అంటున్నారు. Also Read: Manmohan: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం ఈ క్రమంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో గంటకు 65 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద ఇప్పటికే అధికారులు మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు చెప్పారు. Also Read: Manmohan Singh: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి... బలమైనన గాలులతో పాటు వర్షాల కారణంగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారిణి సుధావల్లి స్పష్టం చేశారు. అలాగే రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెలంతా వర్షాలు కురుస్తూనే ఉన్నాయని.. దాని వల్ల తమ పొలం పనులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే వరి కోసిన వాళ్లు ధాన్యం ఆరబెట్టుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. Also Read: Breaking: సొనియా గాంధీకి అస్వస్థత.. CWC సమావేశానికి దూరం మరికొందరు పంటను కోయలేక.. ధాన్యం తడిసి భూమి పాలవుతుంటే కన్నీళ్లు పెడుతున్నారు. అప్పులు చేసి మరీ పండించిన పంట చేతికందకుండా పోతుంటే గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు సాయం చేయాలని కోరుతున్నారు.