Ap Rains: ఏపీపై అల్పపీడీన ప్రభావం.. వాతావరణ శాఖ అలర్ట్!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

New Update
rains ap

rains

Ap Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో  మంగళ వారం ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు విపత్తుల నిర్వహన సంస్థ. ఈరోజు  తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తిరుపతి, కడప , అన్నమయ్య, చిత్తూరు,  జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశలున్నాయని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Also Read: మరి మీరు అలా ఎందుకు చేయలేదు? పోలీసులకు వకీల్ సాబ్ సూటి ప్రశ్నలు!

గురువారం వరకు వానలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మేఘాలు కమ్ముకుని, చలిగాలులు తీస్తున్నాయి. బుధవారం ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి ,, జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో గాలులు వీస్తాయంటున్నారు. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని మన్యంలో చలి తీవ్రత పెరిగింది. 

Also Read: Dead Body Parcel Case: డెడ్‌బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు అరెస్ట్!

ఏజెన్సీ ప్రాంతంలో చలి గాలులు వీస్తున్నాయి.. అలాగే మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ప్రభావంతో ఎండా, మంచు లేదు.. చలి గాలులతో గిరిజనులు అల్లాడిపోతున్నారు.మరోవైపు బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏపీ ప్రజల్ని, మరీ ముఖ్యంగా రైతుల్ని వణికిస్తున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రెండు, మూడు రోజుల అనంతరం బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 26 తర్వాత మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా వరుస అల్పపీడనాలు, తుఫాన్‌ల  ప్రభావంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Also Read: Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు!

గత నెల, ఈ నెలలో అల్పపీడనాలతో వరి రైతులు ఆందోళనలో ఉన్నారు.వర్షానికి ధాన్యం తడుస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వరి పొలంలో పంట ఉండటంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. మూడు రోజుల క్రితం అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిశాయి.అయితే ఈ వర్షాలపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంట నష్టం వివరాలు సేకరించాలని అధికారులకు చెప్పారు.

Also Read: Skin Care: నిద్రపోయే ముందు ఇలా చేయండి..చర్మం మంచులా మెరిసిపోతుంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు