EC: 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'సర్' మూడో దశ.. ఈసీ కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్టును పటిష్టం చేసే టార్గెట్‌తో ఎన్నికల సంఘం (EC) గురువారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మూడో దశను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్టును పటిష్టం చేసే టార్గెట్‌తో ఎన్నికల సంఘం (EC) గురువారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మూడో దశను ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల గణన ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) ఒక కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతిమంగా విజయం తృణమూల్ కాంగ్రెస్‌దే అని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ SIR అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడి, ప్రస్తుతం అప్పీలేట్ ట్రిబ్యునల్స్‌లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులకు 'మధ్యంతర ఓటు హక్కు' కల్పించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
గతంలో ఎన్నడు లేని విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు దేశవ్యాప్తంగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. అంతేకాదు, మనదేశ చరిత్రలోనే తొలిసారిగా జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు విపక్ష పార్టీలు రెడీ అవుతుండటం విశేషం.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 63.66 లక్షల ఓటర్లను తొలగించారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రత్యేక సమగ్ర సవరణ అనంతర ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ క్రమంలో దాదాపు 8 లక్షల ఓట్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 58 లక్షల ఓట్లు తొలగించగా.. తాజాగా ఈ సంఖ్య దాదాపు 66 లక్షలకు చేరింది.
తమిళనాడులో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (sir) పూర్తయింది. తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. గత ఎన్నికలతో పోలిస్తే 74లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయినట్లు ఈసీ ప్రకటించింది. కాగా ఈ రివిజన్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అనర్హత కలిగిన ఓటర్లను జాబితా నుంచి తొలగించింది.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) 2026 ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.