EC: 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'సర్‌' మూడో దశ.. ఈసీ కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్టును పటిష్టం చేసే టార్గెట్‌తో ఎన్నికల సంఘం (EC) గురువారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మూడో దశను ప్రకటించింది.

New Update
Election commission announces Phase 3 of SIR

Election commission announces Phase 3 of SIR

దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్టును పటిష్టం చేసే టార్గెట్‌తో ఎన్నికల సంఘం (EC) గురువారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మూడో దశను ప్రకటించింది. ఈ దశలో మొత్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కానీ హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలను ప్రస్తుతం ఈ జాబితా నుంచి మినహాయించారు. ఎందుకంటే ఈ మూడు ప్రాంతాల్లో జనగణన (సెన్సస్) రెండో దశ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఎగువ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉంది. విపరీతంగా మంచు కురుస్తున్న కురుస్తోంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అక్కడ ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను మళ్లీ ప్రకటిస్తామని ఈసీ తెలిపింది.

Also Read: పాపం కేసీ వేణుగోపాల్.. ఎందరినో సీఎం, మంత్రులుగా చేసి.. ఆయన విషయంలో అసలేం జరిగింది?

 అయితే ఈ మూడో దశ సవరణ ప్రక్రియలో దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్లను చేరుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీనికోసం  ఆయా రాష్ట్రాల్లో 3.94 లక్షల మందికి పైగా బూత్‌ లెవల్ ఆఫీసర్లను (BLOs) నియమించనున్నారు. వీళ్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన 3.42 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లు సైతం అధికారులకు సహకారం అందించనున్నారు. ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో పారదర్శకతను పెంచడం కోసం, అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఈ మూడో విడత సవరణ కీలకం కానుంది.

Also Read: భారీ వర్షాలు.. ఒక్కరోజులోనే 89 మంది మృతి

ఇప్పటికే పూర్తయిన మొదటి రెండు దశల పురోగతిని ఈసీ వివరించింది. మొదటి రెండు దశల్లో 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకంగా 59 కోట్ల మంది ఓటర్లను కవర్ చేసినట్లు పేర్కొంది. ఈ ప్రక్రియలో భాగంగా 6.3 లక్షల మంది BLOలు, 9.2 లక్షల మంది BLAలు పాల్గొన్నారు. 

Advertisment
తాజా కథనాలు