/rtv/media/media_files/2026/01/06/uttar-pradesh-sir-voter-list-2026-01-06-12-16-40.jpg)
Uttar Pradesh SIR Voter List
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) 2026 ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఈమేరకు గురువారం ఈసీ కార్యదర్శి పవన్ దివాన్ లేఖ విడుదల చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ ప్రక్రియ సజావుగా సాగేలా సాధ్యమైనంత త్వరగా సన్నాహక పనులను పూర్తి చేయాలని ముఖ్య ఎన్నికల అధికారులకు తెలియజేశారు.
కమిషన్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో SIR-సంబంధిత ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏప్రిల్ ఈప్రక్రియ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు వేగవంతం చేశారు. నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హతలేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘సర్’ను పూర్తి చేసింది సీఈసీ. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ‘సర్’ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది.
ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలి, డామన్ అండ్ డియులో ఏప్రిల్ నుంచి ‘సర్’ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
‘సర్’లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్లను గుర్తిస్తారు. ఆ ఇంట్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వంటి ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు సమర్పించి ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్లు లేని ఓట్లను తొలగిస్తారు.
Follow Us