/rtv/media/media_files/2026/03/28/cm-mamata-banerjee-2026-03-28-16-48-25.jpg)
CM Mamata Banerjee
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల గణన ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) ఒక కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలపై ఆమె స్పందిస్తూ, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై కొన్ని గంటలు గడుస్తున్నా, ఇప్పటివరకు కేవలం మూడు రౌండ్ల లెక్కింపు మాత్రమే జరిగిందని దీదీ స్పష్టం చేశారు. ప్రారంభ ట్రెండ్స్‌ను చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా చాలా రౌండ్ల లెక్కింపు మిగిలి ఉందని ఆమె తన కార్యకర్తలకు, మద్దతుదారులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ 'SIR' (S.I.R) సాకుతో లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగించిందని, తద్వారా ఓట్లను దొంగిలించిందని ఆమె ఆరోపించారు. మైనారిటీలు, మతువా, రాజ్‌బన్షీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనానికి పాల్పడ్డారని ఆమె విమర్శించారు. ఓట్ల తొలగింపుపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ప్రజల తీర్పును అపహాస్యం చేసే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు.
ప్రస్తుత ట్రెండ్స్ ఎలా ఉన్నప్పటికీ, తుది ఫలితాలు వెలువడేసరికి చిత్రమంతా మారుతుందని మమత ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు టీఎంసీ కార్యకర్తలెవరూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లవద్దని ఆమె కోరారు."అంతిమంగా విజయం తృణమూల్ కాంగ్రెస్‌దే. బీజేపీ ఎన్ని కుతంత్రాలు చేసినా, బెంగాల్ ప్రజలు మా వైపే ఉన్నారు. ఫలితాల ముగింపు సమయానికి మేము మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ ఏజెంట్లకు మమతా బెనర్జీ కీలక సూచన చేశారు.TMC ఏజెంట్లు సహనం కోల్పోవద్దన్న మమత TMC ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్లలోనే ఉండాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తన ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించవద్దని మమత ఆదేశించారు. ఫలితాల సరళి మారుతున్న కొద్దీ బెంగాల్ రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతోంది.
Follow Us