/rtv/media/media_files/2026/01/06/uttar-pradesh-sir-voter-list-2026-01-06-12-16-40.jpg)
West Bengal SIR
West Bengal SIR : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైంది.‘ప్రత్యేక సమగ్ర సవరణ’ అనంతర ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది ఈ క్రమంలో దాదాపు 8 లక్షల ఓట్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అర్హత లేని పేర్లను జాబితా నుండి తొలగించినట్లు తెలిపింది. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు ఇందులో ఉన్నారు. నకిలీ ఓటర్ల గుర్తింపు కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
కాగా గతేడాది ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సమయంలో 58 లక్షల ఓట్లు తొలగించగా.. తాజాగా ఈ సంఖ్య దాదాపు 66 లక్షలకు చేరింది. అదేవిధంగా మరో 60 లక్షలకుపైగా ఓటర్లను ‘పరిశీలన’ కేటగిరీలో చేర్చారు. ఈ ఓటర్ల వివరాలను జ్యుడిషియల్ అధికారులు తనిఖీ చేసిన తర్వాత చర్యలు చేపట్టనున్నారు.రాష్ట్రంలో మొత్తం 7.66 కోట్ల మంది ఓటర్లు ఉండగా గతేడాది నవంబరు 4న బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రారంభించారు. డిసెంబరు 16న తొలి ముసాయిదా జాబితాను ప్రకటించారు. అప్పుడు మరణాలు, వలసలు, నకిలీల వంటి కారణాలతో 58 లక్షల ఓట్లను తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 7.08 కోట్లకు చేరుకుంది. విచారణలు, పరిశీలనల అనంతరం తాజాగా మరో 8 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 7.08 కోట్ల మంది ఓటర్లలో తొలంగింపు తర్వాత ఇప్పటివరకు దాదాపు 6.4 కోట్ల మందిని ఆమోదిత జాబితాలో చేర్చారు. అయితే తుది జాబితా విడుదలైన తర్వాతే గణాంకాలపై పూర్తి క్లారిటీ వస్తుందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అప్‌డేట్ చేసిన ఓటర్ల జాబితాలను జిల్లాల్లోని ఎస్‌డీవో, బీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భబానీపుర్‌లో ఇప్పటివరకు 47 వేల ఓట్లను తొలగించారు. మరో 14 వేలమందిని ‘పరిశీలన’ జాబితాలో చేర్చారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ముందు ఇక్కడ 2.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయ పార్టీలు ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార యంత్రాంగం నిబంధనలను అతిక్రమించిందని వారు ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే నిష్పక్షపాతంగానే ఈ ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలోనే తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రక్రియపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుమారు 1.2 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అధికార యంత్రాంగం రహస్యంగా ఓట్లను తొలగిస్తోందని ఆమె విమర్శించారు. అర్హులైన ఓటర్లకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు బీజేపీ నేతలు ఈ ప్రక్రియను స్వాగతించారు. చొరబాటుదారుల ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా తన పని తాను చేస్తోందని చెప్పారు. ఓటర్లు తమ స్థితిని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఓటు తొలగింపునకు గురైన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
Follow Us