Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెడ్ అలెర్ట్ జారీ రానున్న 2 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే సైబరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోందని.. ఆ తర్వాత నగరవ్యాప్తంగా ఇది విస్తరిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Monkeypox: అమ్మో మంకీ ఫాక్స్..హైదరాబాద్ కూడా అలెర్ట్ అవ్వాల్సిందే ! ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. బయట దేశాలలోనూ ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హైదరాబాద్ కు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిపోయేవారు ఎక్కువ. దీంతో హైదరాబాద్ ప్రజలు అలెర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. By KVD Varma 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fater Of Agni Missile: ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్ రామ్ నరైన్ కన్నుమూత డీఆర్డీవో మిస్సైల్ సైంటిస్ట్ రామ్ నరైన్ అగర్వాల్ (84) HYD లో కన్ను మూశారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్ అని అంటారు. వయో సంబంధిత సమస్యలతో పోరాడుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో మూడు రోజులు వానలే ! హైదరాబాద్‌లోని మాదాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్,యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రహదారులన్నీ జలమయమ్యయాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. తెలంగాణలో మరో మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ఔటర్‌పై మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి! హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ఓ కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల ఆందోళన.. ఎందుకంటే? నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద అధికారులు ఉచిత పార్కింగ్ ఎత్తివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఇచ్చి.. ఇప్పుడు సడెన్ గా డబ్బులు వసూలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ పార్కింగ్ కల్పించాలని డిమాండ్ చేశారు. By B Aravind 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలే.. వానలు! తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి. మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Hyderabad : ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ పై చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 16 నుంచి 26 వరకు ఇండియాలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలోనూ ఈ ఫెయిర్ ఉంటుందని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది.భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn