/rtv/media/media_files/2026/03/02/iranian-general-consulate-hyderabad-2026-03-02-17-18-08.jpg)
Iranian General Consulate (Hyderabad)
khameni-Hyd Relations : అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పై విరుచుకుపడ్డాయి.ఈ దాడిలో ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ మరణించారు. దీంతో ఆ దేశంలో కొన్ని వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ అమెరికాకు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది.ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి ఇరాన్‌తో ఉన్న అనుబంధాన్ని హైదరాబాద్ నగర వాసులు గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి హైదరాబాద్‌కు ఇరాన్‌కు ఉన్న అనుబంధం కొన్ని శతాబ్ధాలది. హైదరాబాద్ నగర నిర్మాణం ఇరానీయన్ నిర్మాణ శైలిలోనే జరిగింది. దీనికి కారణం హైదరాబాద్ నగర రూపశిల్పి మీర్ మోమిన్ అస్త్రాబాదీ ఇరాన్ (నాటి పర్షియా) కు చెందిన వాడు కావడమే.. అంతెందుకు హైదరాబాద్ నిర్మాతలైన కుతుబ్‌షాహీలు, వారి తర్వాత నగరాన్ని పాలించిన నిజాంషాహీలు అంతా కూడా ఇరాన్ నుంచి వలస వచ్చినవారే .
మహమ్మద్ కులీకుతుబ్ షా కొలువులో ప్రధానిగా పనిచేసిన మీర్ మోమిన్ అస్త్రాబాదీ.. 1591లో తన ప్రభువైన కులీకుతుబ్ షా కలలకు రూపమిస్తూ నగరాన్ని సుందర ఉద్యాన వనాలు, అద్భుత కట్టడాలతో నిర్మించారు. ఇవన్నీ కూడా పర్షియన్ వాస్తు శైలిలోనే మనకు దర్శనమిస్తాయి. గోల్కొండ కట్టడాలు, చార్మినార్, కుతుబ్ షాహీల సమాధులు..ఇలా ఒక్కటేమిటీ హైదరాబాద్ నగరంలోని పురాతన నిర్మాణాలన్నింటిలో పర్షియన్ వాస్తు శైలి కనిపిస్తుంది,
తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునే మొహర్రం పండుగ ఇరాన్, హైదరాబాద్ ప్రాంతాల సాంస్కృతిక జీవనానికి ఒక వారధిగా నిలుస్తోంది. కేవలం నిర్మాణాలే కాదు పర్షియన్ భాషలోని ఎన్నో పదాలు హైదరాబాదీ భాషలో కలిసి పోయాయి. ఇపుడు మనం ఉపయోగిస్తున్న దర్వాజ, ఖర్చు, మెహఫిల్, దావత్ వంటి ఎన్నో పర్షియన్ పదాలే దీనికి నిదర్శనం. ఒకవైపు ఉర్ధూ, మరోవైపు తెలుగు భాషతో కూడిన హైదరాబాద్ నగర భాషలో పర్షియన్ కూడా మిలితమై త్రివేణి సంగమంలా భాషలను సుసంపన్నం చేశాయి. భాష మాత్రమే కాదు అక్కడి అహారపు అలవాట్లు కూడా హైదరాబాద్ నగర అలవాట్లతో పెనవేసుకుపోయాయి. మనం ఇష్టంగా తినే బిర్యానీ, హలీం, తాగే ఇరానీ చాయ్ వంటి పదార్థాలన్నీ ఇరాన్ నుంచి వచ్చినవే. ప్రస్తుతం మనకు నగరంలో కనిపించే ఇరానీ కేఫ్‌లు, బిర్యానీ హోటళ్లు అన్ని కూడా శతాబ్ధం క్రితం ఇరానీలు ఇక్కడికి వలస వచ్చి నెలకొల్పినవే కావడం గమనార్హం. ఆ అనుబంధం నేటికి కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం విషయంలోనూ సంబంధాలున్నాయి. హైదరాబాద్ నుంచి ఇరాన్‌కు ఔషధాలు వెళితే, అక్కడి నుంచి కార్పెట్లు, డ్రైఫ్రూట్స్ మనకు వస్తున్నాయి.
ఇరానీ గల్లీ, ఖమేనీ రోడ్డు
ఇరానీయులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరాన్ సంస్కృతి, సంప్రదాయాలు హైదరాబాద్ సంప్రదాయాలతో కలిసిపోయాయి. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత పాత నగరంలో ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడ వారు కొన్ని ప్రాంతాలకు వారి దేశం పేర్లు కూడా పెట్టుకున్నారు. ఓల్డ్ సిటీలో ఇరానీ గల్లీ నేటికీ మనకు కనిపిస్తుంది. అదే కాదు నగరంలో ఇరాన్ కాన్సులేట్ కూడా ఉంది. నగరంలో ఇరాన్ దౌత్యకార్యాలయం ఉన్న బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబరు-7కు ఇరాన్ మొదటి సుప్రీం నాయకుడు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ వ్యవస్థాపకుడు ఇమామ్ ఖమేనీ స్మారకంగా ఖమేనీ పేరునే పెట్టారు. ఇక పర్సియన్లు నగరానికి వచ్చిన తర్వాత జరిగిన వివిధ అంశాలకు సంబంధించిన వందకుపైగా ప్రఖ్యాత పర్షియన్ చారిత్రక పత్రాలు నగరంలోని ఆర్కైవ్స్‌లో కొలువుతీరాయి. 2018లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ మనదేశానికి వచ్చాడు. ఆ సందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన ఆయన పర్షియన్ పద్దతిలో నిర్మితమైన సాలార్జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ సమాధులు, మక్కామసీదులను సందర్శించారు. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆదివారం పాతనగరంలో ఇరానీయులు ఉన్న ప్రాంతంలో ర్యాలీ తీయడం గమనార్హం.
Follow Us