/rtv/media/media_files/2026/02/26/hyderabad-traffic-2026-02-26-16-34-05.jpg)
Hyderabad Traffic
హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ రద్దీ వల్ల వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలుచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం గచ్చిబౌలిలోని PSIOC, ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్‌లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
దీంతో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌కు చెందిన ట్రాన్స్‌కాలిటీ కంపెనీ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ ఏఐ ఆధారిత ట్రాఫిక్ పరిష్కారాలపై స్పెషల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కడ ఉందనే విషయాన్ని ముందుగానే గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల సిగ్నల్ వ్యవస్థకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసి వాహనాల రాకపోకలను సుగమం చేయొచ్చని తెలిపారు.
హైదరాబాద్‌లో రాబోయే రోజుల్లో జరగనున్న మౌలిక సదుపాయల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ప్లాన్‌ను తయారుచేయాలని సీపీ సీవీ సజ్జనార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అడ్వాన్స్‌డ్ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ టెక్నాలజీని వాడటం వల్ల రోడ్డు భద్రత మెరుగుపడటమే కాక సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
🚦 Cyberabad Goes High-Tech: AI-Driven Traffic Management! 🤖
— Cyberabad Police (@cyberabadpolice) February 25, 2026
Cyberabad Police is exploring a world-class, AI-based predictive traffic management model to tackle congestion and enhance road safety.
@CPCYBERABAD Dr. M. Ramesh met with Dr. Lucas Ambul (CEO, Transcality, Zurich)… pic.twitter.com/dvj49vdvsS
Follow Us