BIG BREAKING: హైదరాబాద్‌లో హోటల్స్ బంద్ !

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. హైదరాబాద్‌లో కూడా కొన్ని హోటల్స్‌ మూసివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో LPG కొరత లేదని మంగళవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

New Update
hotels to close in hyderabad ?, Government says LPG production up 10% today dismisses shortage concerns

hotels to close in hyderabad ?, Government says LPG production up 10% today dismisses shortage concerns

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో LPG కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. హైదరాబాద్‌లో కూడా కొన్ని హోటల్స్‌ మూసివేయనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు వరకు గ్యాస్ నిల్వలున్నాయని.. రేపు, ఎల్లుండి పరిస్థితిని బట్టి హోటల్స్ మూసివేస్తామని హోటల్స్‌ యజమానులు చెబుతున్నారు. రోజువారిగా 15 నుంచి 20 గ్యాస్ సిలాండర్ల అవసరం ఉంటుందని ఇప్పుడు అవి కూడా రాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి గ్యాస్ నిల్వ కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

Also Read: బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీలు దూరం...గులాబీ శ్రేణుల్లో ఆందోళన

ఈ క్రమంలోనే తాజాగా కీలక ప్రకటన వచ్చింది. దేశంలో LPG కొరత లేదని మంగళవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్యాస్ సరఫరాను స్థిరీకరించినట్లు పేర్కొన్నాయి. ఎల్‌పీజీ కొరత కారణంగా దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఆందోళన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ అంశంపై స్పందించాయి. అంతేకాదు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రిఫైనరీలు LPG ఉత్పత్తిని 10 శాతం వరకు పెంచినట్లు పేర్కొన్నాయి. కృత్రిమ కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాయి. 

Also Read: గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు పడే డేట్ వచ్చేసింది!

Advertisment
తాజా కథనాలు