BREAKING: అయోధ్య రామాలయం వద్ద భారీ అగ్నిప్రమాదం
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సరయూ నది తీరాన నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సరయూ నది తీరాన నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
అయోధ్య రామమందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహారం విక్రయించడమే కాకుండా, ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయడంపై కూడా అధికారులు నిషేధం విధించారు. అయోధ్యలోని 'పంచకోశి పరిక్రమ' మార్గం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.
అయెధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం, దానిని ప్రధాని చేతులు మీదుగా నిర్వహించడంపై పక్క దేశం పాకిస్తాన్ విషం కక్కింది. దీనికి భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ఇతరులకు నీతులు చెప్పే నైతికత మీకెక్కడదని నిలదీసింది.
అయోధ్య రామాలయం మరోసారి ముస్తాబైంది. ఆలయ నిర్మాణ పూర్తికి చిహ్నంగా ఈరోజు ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని కోసం అయోధ్యను మొత్తం సరికొత్తగా అలంకరించారు.
సరయూ నదీ తీరంలోని ఘాట్లు, రామ్ కీ పైడి ప్రాంతంలో 26 లక్షల (26,11,101)కు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి, గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. గతేడాది 25 లక్షల దీపాల రికార్డును ఈసారి బ్రేక్ చేశారు. దీపాల వెలుగులో అయోద్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయోధ్యలో ఓ భారీ పేలుడు సంభవించింది. అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో ఐదుగురు స్పాట్లోనే మృతి చెందారు. ఈ పేలుడు వల్ల ఓ ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద కూడా ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
అయోధ్యలో అతిపెద్ద పండుగ జరగబోతోంది. 'దీపోత్సవ్ 2025' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2,100 మంది భక్తులచేత 2.6 మిలియన్ల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తోంది.
అయోధ్యలోని ఖండ్సా బజార్ దుర్గా పూజ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. అసభ్యకర పాటలు, నృత్యాలతో కూడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ రోజు రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ బ్లడ్ మూన్ ప్రభావంతో దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ దాదాపు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ముసేసినా.. ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయం, ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కల్కాజీ మందిర్ ఆలయం తెరిచే ఉంటాయి.