BREAKING: అయోధ్య రామాలయం వద్ద భారీ అగ్నిప్రమాదం

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సరయూ నది తీరాన నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
Fire erupts 800 meters from Ram Temple in Ayodhya

Fire erupts 800 meters from Ram Temple in Ayodhya

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సరయూ నది తీరాన నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రామాలయానికి 800 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడం కలకలం రేపింది. యజ్ఞశాలలో మంటలు చెలరేగడంతో వెదురు, గడ్డితో తయారుచేసిన పండల్‌ క్షణాల్లోనే దగ్ధమైపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్‌తో పాటు మరికొందరు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read: గాల్లో ఇంజన్ ఫెయిల్..ఢిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పేశారు. అయితే యజ్ఞగుండంలో నిప్పురవ్వలు ఎగిసి పడటం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి తీవ్రంగా ఆరోపణలు వస్తున్నాయి. యజ్ఞ నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారని తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. 

Also Read: కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ భీకర దాడులు.. వీడియో వైరల్

యజ్ఞం పేరుతో మంత్రికి సంబంధించిన విభాగాన్ని వాడుకుని నిధులు సేకరించారని.. ఖర్చు తగ్గించుకోవడం భద్రతా ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆర్థిక వనరులు, మానవ వనరుల వినియోగంపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అగ్నిప్రమాదానికి బాధ్యులైనవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు