Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు తన రాజీనామా లేఖను విజయసాయి రెడ్డి అందించారు. స్పీకర్ ఫార్మాట్లో ధన్‌ఖడ్‌కు రాజీనామ లేఖ ఇచ్చారు.
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు తన రాజీనామా లేఖను విజయసాయి రెడ్డి అందించారు. స్పీకర్ ఫార్మాట్లో ధన్‌ఖడ్‌కు రాజీనామ లేఖ ఇచ్చారు.
ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైరావపట్నం వద్ద నివసిస్తున్న సంచార జాతులకు చెందిన దాదాపు పది గుడిసెలు దగ్ధం అయ్యాయి. చంటి పిల్లవాడికి పాలు కాద్దామని గ్యాస్ స్టవ్ అంటించగా అకస్మాత్తుగా మంటలు ఎగసిపడినట్లు తెలుస్తోంది.
ఏపీ కొత్త డీజీపీ ఎవరనే చర్చ జోరుగా నడుస్తోంది. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి కంపెనీలో విద్యుద్ఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో దాదాపుగా పత్తి, పత్తి బేళ్లు, పత్తి గింజలు మంటల్లో కాలిపోయాయి. వీటి విలువ దాదాపుగా రూ.8.8 కోట్లు ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వైరస్ సోకింది. లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గంట ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు, చికెన్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు. ఇటీవల కావలి ఆసుపత్రిలో పోలీసులు, టీడీపీ నేతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కేజీ చికెన్ ధర మహా అయితే ఎంతుంటుంది... రూ. 300 లేదా రూ. 400 కానీ ఈ కోడి ధర రూ.లక్ష కంటే ఎక్కువ ఉందంటే మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏముంది ఈ కోడిలో.. అంత ధర ఎందుకో తెలియాలటే ఈ వార్త పూర్తిగా చదవండి.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది మే 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. మెయిన్స్ ప్రశ్నపత్రాన్ని ట్యాబుల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పేర్కొన్నారు.