/rtv/media/media_files/2025/01/21/TiBypuw8Cs37nQlOGOe1.jpeg)
APPSC
Group-1: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది మే 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. మెయిన్స్ ప్రశ్నపత్రాన్ని ట్యాబుల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పేర్కొన్నారు. మే 3 న తెలుగు, 4న ఇంగ్లీష్, 5న పేపర్-1 జనరల్ ఎస్సే, 6న పేపర్-2 హిస్టరీ, కల్చరల్, 7న పేపర్-3 పాలిటీ, లా, 8వ తేదీన పేపర్-4 ఎకానమీ, 9న పేపర్-5 సైన్స్, టెక్నాలజీ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అలాగే ఈ పరీక్షలన్నీ కూడా ఉదయం 10.00 AM గంటల నుంచి మధ్యాహ్నం 1.00 PM గంటల వరకు జరుగనున్నాయి.
Also Read: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!
/rtv/media/media_files/2025/01/21/XIMHLaNPQHaaPeNvcIjF.jpeg)