/rtv/media/media_files/2025/01/04/N8wK2UMxJd9xnGeSULlX.jpg)
Fire accident
Kurnool Fire Accident: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో విద్యుద్ఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పత్తి, పత్తి బేళ్లు, పత్తి గింజలు మంటల్లో కాలిపోయాయి. వీటి విలువ దాదాపుగా రూ.8.8 కోట్లు ఉంటుందట. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో రెండు ఆటోలు కూడా దగ్ధమయ్యాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర
కిటికీ డోరు పగలగొట్టి..
ఇదిలా ఉండగా.. రాజస్థాన్ (Rajasthan) లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భిల్వారా పట్టణంలో ఓ మహిళ ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కిటికీ డోర్లు పగలగొట్టి ఆమెను ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అంబులెన్స్ డోర్లు ఓపెన్ కాకపోవడంతో ఆ మహిళ అక్కడే మృతి చెందింది.
ఇది కూడా చూడండి: OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?
దాదాపు 15 నిమిషాల పాటు అంబులెన్స్ డోర్లు ఓపెన్ కాకపోవడం వల్లే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే అంబులెన్సు (Ambulance) ఆపరేటర్ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలను ఖండించారు. అంబులెన్సులోకి ఆమెను తీసుకురాక ముందే మరణించిందని, తన దగ్గర నాడి కదలిక డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని అన్నారు. దీంతో దర్యాప్తు కోసం ఓ కమిటీని వేశారు.
ఇది కూడా చూడండి: BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!