/rtv/media/media_files/2025/01/22/3rvp9ZA0vtDMW0JglWRG.jpg)
cock fighting Photograph: (cock fighting )
కేజీ చికెన్ ధర మహా అయితే ఎంతుంటుంది... రూ. 300 లేదా రూ. 400 కానీ కోడి ధర రూ.లక్ష కంటే ఎక్కువ ఉందంటే మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పై ఫోటోలో చూస్తున్న ఈ కోడి ధర అక్షరాల రూ.లక్ష 11వేలు. అయితే ఈ కోడి ధర ఎందుకు ఇంత ఎక్కువగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీ అనగానే సంక్రాంతి పండగ..ఈ పండగకు అక్కడ కోడిపందాలు జోరుగా సాగుతాయి. గోదావరి జిల్లాల్లో ఇటీవల రెండు కోళ్ల మధ్య జరిగిన పోట్లాటపై కోటి రూపాయల పందెం వేయగా, ఆ పోరాటంలో గెలిచిన కోడి యజమాని కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఓడిపోయిన కోడికి పందెం వేయగా ఏకంగా రూ. లక్ష 11 వేల 111 కు కొనుగోలు చేశాడు. ఎందుకంటే అది కోజా పుంజు కావడమే.
కోజా పుంజు గురించి అంటే సింపల్ గా చెప్పాలంటే.. సంక్రాంతి పండగ పోటీలకు పుంజులకు కొన్ని నెలల పాటు బలవర్ధకమైన ఆహారం పెట్టి పెంచుతారు. అయితే పోటీల్లో ఓడిపోయిన పుంజును కోజా పుంజు అని పిలుస్తారు. దీనిని ఎవ్వరికీ పందెం రాయుళ్లు ఇవ్వరు. కోజా పుంజు సాధారణ కోడి కంటే చాలా రుచిగా ఉంటుంది.
వదులుకోవడం ఇష్టం లేక
తాజాగా ఏలూరు యన్ఆర్ పేటకు చెందిన రాజేంద్ర, ఆహ్లద్, రాజవంశీలు కోడిపుంజులు పెంచుతారు. అయితే సంక్రాంతి పోటీల్లో వారి కోడి ఓడిపోయింది. రూల్ ప్రకారం ఆ పుంజు గెలిచిన వారికి సొంతం కావాలి. అయితే దాన్ని వదులుకోవడం ఇష్టం లేక వారికి మళ్లీ డబ్బు చెల్లించి వెనక్కు తీసుకున్నాడు వంశీ. దాని గొప్పతనం అందరికీ తెలిసే విధంగా చేయాలని కోజా (చనిపోయిన కోడి)ని వేలం పాటకు పెట్టాడు. ఈ పాటలో ఏలూరు రూరల్ మండలం జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ దాన్ని ఏకంగా రూ. లక్ష 11 వేలకు దక్కించుకున్నాడు. చనిపోయిన కోడిని ఇంత ధర పెట్టి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.