Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్ హెచ్చరికలు!
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరుగుదేశం కెనడాతో సుంకాల పేరుతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ,ట్రంప్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్‌నే వెల్లడించారు.
అమెరికాలోని ఉన్నత విద్య, పరిశోధనల కోసం అక్కడ యూనివర్సిటీలలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులకు బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్‌లను లైక్ చేసినా..షేర్ చేసినా వీసాలను రద్దు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు.మోడీ గొప్ప ప్రధాన మంత్రి అంటూ ప్రశంసలు కురిపించారు.
గ్రీన్ ల్యాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రణాళికలతో తమకుఏ సంబంధం లేదని రష్యాఅధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.కాకపోతే ఈ విషయంలో మాత్రం అమెరికా చాలా సీరియస్ ప్లాన్లు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ట్రంప్ సుంకాలు అన్యాయమైనవని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు.వాహన దిగుమతుల పైనా 25 శాతం సుంకాన్ని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య ఉన్న పాత బంధం ముగిసిపోయిందని కార్నీ అన్నారు.
యూఎస్ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా పేర్కొంది.యూఎస్ నుంచి సాయం ఆగిపోతే దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గావి ఆందోళన వ్యక్తం చేసింది.
భారతీయ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్‌పై అమెరికాలో ఆంక్షలు విధించాలని సిఫార్సు చేసింది. RAW సిక్కు ఏర్పాటువాదులే టార్గెట్ చేసిందని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛపై కమిషన్ నివేదిక విడుదల చేసింది. భారత్ మైనార్టీ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది.
అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మాట్లాడినట్లు ఓ ఆడియో వైరల్ అవుతుంది.అందులో మస్క్ అమెరికా వ్యక్తి కాదని, ప్రభుత్వం విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడని వాన్స్ అన్నట్లు ఉంది. కానీ అది ఏఐ సృష్టించిన ఆడియో అని వాన్స్ దానిని కొట్టిపారేశారు.