Putin:ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదంటున్న పుతిన్‌!

గ్రీన్ ల్యాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ట్రంప్‌ ప్రణాళికలతో తమకుఏ సంబంధం లేదని రష్యాఅధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు.కాకపోతే ఈ విషయంలో మాత్రం అమెరికా చాలా సీరియస్ ప్లాన్లు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

New Update
Russia President Putin

Russia President Putin

గ్రీన్ ల్యాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న  ట్రంప్‌ ప్రణాళికలతో తమకుఏ సంబంధం లేదని రష్యాఅధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. ఆయన ఆర్కిటిక్ పోర్టు నగరం మురుమాన్క్స్‌ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షిప్తంగా చెప్పాలంటే గ్రీన్‌ ల్యాండ్‌ విషయంలో అమెరికావి చాలా సీరియస్‌ ప్లాన్లు.వీటికి లోతైన చారిత్రక మూలాలున్నాయి. అమెరికా ప్రణాళిక ప్రకారం దాని భౌగోళిక వ్యూహాత్మక,సైనిక -రాజకీయ,ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేస్తుంది.

Also Read:Canada: అమెరికాతో ఆ బంధం ముగిసింది.. ఇక ప్రతి చర్య తప్పదు: కెనడా!

గ్రీన్‌ ల్యాండ్‌ అంశం రెండు దేశాలకు సంబంధించింది .రష్యాతో దానికి ఎలాంటి సంబంధం లేదు అని పుతిన్‌ పేర్కొన్నారు.రష్యా సహా ప్రపంచ దేశాల్లో ఆర్కిటిక్‌ ప్రాధాన్యం పెరుగుతోందని పుతిన్‌ అభిప్రాయపడ్డారు.కానీ దురదృష్టవశాత్తూ భౌగోళిక రాజకీయ పోటీ, ఈ ప్రాంతంలో పొజిషన్‌ కోసం ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. 

Also Read: Elon Musk: ఫెడరల్ HRలో ట్రంప్ విధేయులు.. ఒత్తిడిలో ఉద్యోగులు...అంతా మస్క్‌ పుణ్యమేనా!

ఇక గ్రీన్‌ల్యాండ్‌ యాజమాన్యం విషయం నేరుగా ఎక్కడా జోక్యం చేసుకోకపోయినా..ఘర్షణలకు ఉత్తర ప్రాంతం వేదికగా మారుతుందన్న ఆందోళన మాస్కోలో ఉందన్నారు. ఓ రకంగా ఇవి ట్రంప్‌ ప్రణాళికలపై తమకే అభ్యంతరం లేదని పరోక్షంగా చెప్పినట్లైందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ పై పుతిన్‌ వ్యాఖ్యలు చాలా వ్యూహాత్మక సమయంలో వెలువడ్డాయి. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఆయన సతీమణి ఉషా వాన్స్‌ గ్రీన్‌ ల్యాండ్‌ లోని అమెరికా సైనిక స్థావరాన్ని సందర్శించనున్నారు. 

ఈ పర్యటన పై ఇప్పటికే గ్రీన్‌ ల్యాండ్‌ ,డెన్మార్క్‌ గుర్రుగా ఉన్నాయి. తొలుత ఉషా ఒక్కరే అక్కడికి వెళ్లాల్సి ఉంది..కానీ, తన సతీమణి పై వస్తున్న విమర్శలు గమనించి జేడీ వాన్స్‌ కూడా టూర్‌ కు సిద్ధమయ్యారు. మరో వైపు ఈ పర్యటనలో డెన్మార్క్‌ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఆర్కిటిక్‌ మంచు కరిగి ఉత్తర సముద్ర మార్గం అందుబాటులోకి వస్తే చైనా , జపాన్ ల నుంచి సరకునలు ఆ మార్గంలోనే అమెరికా ,ఐరోపాలకు పంపవచ్చు.సూయాజ్‌, పనామాకాలువలను ఆశ్రయించనక్కర్లేదు. దాని వల్ల దూరం తగ్గి సమయం, రవాణా వ్యయం ఆదా అవుతాయి. ఉత్తర సముద్ర మార్గానికున్న రక్షణపరమైన ప్రాధాన్యమూ అంతా ఇంతాకాదు. చైనా, రష్యానౌకా దళాలు 2022,23 ల్లో ఆర్కిటిక్‌ లోని బేరింగ్‌ జలసంధిలో సంయుక్త విన్యాసాలు జరిపాయి.

గత అక్టోబరులో రష్యా, చైనా తీరరక్షక నౌకలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఆ రెండు దేశాలు ఆర్కిటిక్‌ లో చేయీచేయీ కలిపి వనరుల అన్వేషణ,వాతావరణ మార్పుల పై పరిశోధన , రక్షణ పరంగా ముందుకుసాగనున్నాయి. అమెరికా,నాటోలు అదే పని చేయనున్నాయి. మంచు లేని ఆర్కిటిక్ ప్రాంతంలో రవాణా నౌకల సంచారం పెరిగిపోతుంది. అక్కడి అపార చమురు, గ్యాస్ నిక్షేపాలు, అరుదైన లోహాలను తవ్వితీయడానికి పోటీ ముమ్మరవుతుంది.భూగోళం పై అరుదైన లోహ నిక్షేపాల్లో 25 శాతం గ్రీన్‌లాండ్‌ లో పోగుపడ్డాయి.అందుకే ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్ లాండ్‌ ను కొనాలని ట్రంప్‌ యోచిస్తున్నారు.

Also Read: Russia-Ukrain War: ఉక్రెయిన్‌ ప్రభుత్వం మారితే కనుక.. యుద్దాన్ని ఆపేస్తాం!

Also Read: Ap Weather: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఏకంగా 42 డిగ్రీలు..ఈ జిల్లాల వారికి మాడు పగులుతుందంతే!

america | russia-putin | vladimir-putin | green-land | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment