/rtv/media/media_files/2025/03/27/5iTCsOnnVobr50MlA6Bm.jpg)
RAW Photograph: (RAW )
ఇండియన్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అనే గూఢచార సంస్థపై అమెరికాలో ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ సిఫారసు చేసింది. సిక్కు వేర్పాటువాదులను టార్గెట్‌గా చేస్తూ రా పని చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. భారతదేశంలోని మైనారిటీలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆ కమిషన్ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. మత స్వేచ్ఛ ఉల్లంఘన విషయంలో ఆందోళనకర దేశంగా భారత్‌ను గుర్తించాలని ప్రతిపాదించింది. వియత్నాం కూడా మత స్వేచ్ఛను నియంత్రిస్తోందని, ఆ దేశాన్ని కూడా ఆందోళనకర దేశంగా ప్రకటించాలని USCIRF కోరింది.
Also read : Telangana : మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై కీలక ప్రకటన!
Indian Spy Agency RAW In US
7/ The Bigger Picture
— HotTakeInsight (@HotTakeInsight) March 26, 2025
The USCIRF report highlights ongoing debates about religious freedom in India, but U.S. action against RAW is unlikely due to strategic interests. Expect diplomatic friction but not major policy shifts. pic.twitter.com/ov5EGctzU3
Also Read : వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం!
2024లో భారత్‌లో మత స్వేచ్ఛ దిగజారిపోయిందని పేర్కొంది. ఆ ఏడాది బీజేపీ నేతలు, ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ముస్లింలు, ఇతర మైనారిటీ మతాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని తెలిపింది. కమిషన్ నివేదికలోని పలు అంశాలను ఆ కథనంలో ప్రస్తావించింది. రా సంస్థకు ఆయుధాలను అమ్మే విషయంలో మరోసారి ఆలోచించాలని అమెరికా ప్రభుత్వానికి సూచించింది.
Also read : Uttar Pradesh: భార్య అక్రమ సంబంధం.. లవర్తో రెండో పెళ్లి చేసిన భర్త!
USCIRF నివేదికపై విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అన్ని మతాలను అనుసరించే 140 కోట్ల మందికి పైగా భారత్‌లో నివసిస్తున్నారని, ఇంత వైవిధ్యంలోనూ సామరస్య జీవనాన్ని సీఐఆర్‌ఎఫ్ అర్థం చేసుకోలేదన్నారు. ఆ సంస్థపై తమకు ఎలాంటి అంచనాలు కూడా లేవన్నారు. ఇక అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌పై భారత ప్రభుత్వం మండిపడుతుంది. ఆ కమిషన్ నివేదిక పూర్తిగా భారత్‌లో పరిస్థితులకు వ్యతిరేకంగా ఉంది. మత స్వేచ్ఛపై నిజాయితీ లేకుండా ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేసేందుకే ఆ నివేదిక ఇచ్చారంటూ తప్పుబట్టింది. అదో పక్షపాతధోరణితో రూపొందించిన నివేదిక అంటూ విమర్శించారు.
Also Read : తాహనజర్ హత్యకు అదే కారణమా? పోలీసుల విచారణలో సంచలనాలు!
latest-telugu-news | research and analysis wing | america | today-news-in-telugu | national news in Telugu | international news in telugu