/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. అణు ఒప్పందం విషయంలో అగ్రరాజ్యం ప్రత్యక్ష చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించిన వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే..బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read: Earthquake: చైనాలో భూ ప్రకంపనలు.. ఆస్పత్రిలో చిన్నారులను కాపాడిన సిబ్బంది, వీడియో వైరల్
అంతకుముందు పెజెష్కియాన్ మాట్లాడుతూ..ఇరుపక్షాల మధ్య ప్రత్యక్ష చర్చల అవకాశాన్ని తిరస్కరించాం.అయితే..పరోక్ష చర్చలకు దారులు తెరిచే ఉన్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ పరోక్ష చర్చలకు అంగీకరిస్తారా?అనేదాని పై స్పష్టత లేదు.
ట్రంప్ మొదటి హయాంలో ఇరాన్ తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది.టెహ్రాన్ పై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి అనేక ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకుట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఇరాన్ తో ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తా.ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదు. చర్చలకువస్తారని ఆశిస్తున్నా. అలా చేయడమే వారికి ప్రయోజనకరం అని తెలిపారు.
trump | iran | bomb | nuclear | iranin nuclear weapons | iran nuclear | iran nuclear bomb | america | latest-news | attacks | threating-call | telugu-news | latest-telugu-news | latest telugu news updates