Trump-Modi: మోడీ గొప్ప ప్రధాన మంత్రి..ట్రంప్‌ ప్రశంసలు!

భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు.మోడీ గొప్ప ప్రధాన మంత్రి అంటూ ప్రశంసలు కురిపించారు.

New Update
pm modi trump

pm modi donald trump Photograph: (pm modi donald trump)

భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇటీవలే అమెరికాలో పర్యటించారు.

Also Read: Ap-Tg Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త...ఠారెత్తిస్తున్న ఎండలు!

ఆయన చాలా తెలివైన వ్యక్తి .మేమిద్దరం మంచి స్నేహితులం.మా మధ్య మంచి చర్చలు జరిగాయి. అవి ఇరు దేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నా.మీకు ..గొప్ప ప్రధాని ఉన్నారు. ఆ దేశంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్న ఏకైక సమస్య సుంకాలు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌ లు విధించే దేశాలలో ఇండియా ఒకటి . వారు బహుశా వాటిని గణనీయంగా తగ్గించబోతున్నారని నమ్ముతున్నా. 

Also Read: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

అయితే ఏప్రిల్‌ 2 న వారు మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలు చేస్తే..నేను వారి నుంచి అంతే వసూలు చేస్తా అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇటీవల మోడీ యూఎస్‌ లో పర్యటించిన సంగతి తెలిసిందే. సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా టారిఫ్‌ ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని మోడీతో స్వయంగా చెప్పినట్లు ట్రంప్‌ తెలిపారు.ఈసందర్భంగా ఇరు దేశాలకు ఉపయోగకరంగా ఉండేలా..వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

భారత్‌-యూఎస్‌ ట్రేడ్ అండ్‌ టారిఫ్‌ చర్చల్లోభారత్‌ ధృఢవైఖరిని ప్రదర్శించింది.కొన్ని వస్తువులపైటారిఫ్‌ కోతలకు అంగీకరించినప్పటికీ..దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది.సుంకాలు తగ్గించినంత మాత్రాన అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు కాదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారి ఇటీవల మీడియాతో పేర్కొన్నారు.వ్యవసాయ ఉత్పత్తులైన వాల్‌ నట్స్‌, యాపిల్‌, బాదం వంటి వాటి పై తగ్గింపునకు సిద్ధంగాఉన్నట్లు తెలిపారు.

అయితే భారత్‌ లో వ్యవసాయరంగ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గోధుమ,మొక్కజొన్న వంటి వాటి పై రాయితీకి అవకాశం లేదన్నారు.

Also Read: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

Also Read: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

trump | modi | latest-news | telugu-news | america | bharat | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ

ఫోర్బ్స్ బిలియనీర్ 2025 జాబితా విడుదలైంది. 342 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ మొదటిస్థానంలో ఉన్నాడు. మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. గతేడాది టాప్ 10లో ఉన్న అంబానీ, ఈసారి 18వ స్థానానికి పడిపోయాడు. అదానీ 28వ ప్లేస్‌లో ఉన్నారు.

New Update
Forbes Billionaires List_ 2025

Forbes Billionaires List_ 2025 Photograph: (Forbes Billionaires List_ 2025)

ఫోర్బ్స్ బిలియ‌నీర్ల 2025 జాబితా విడుదలైంది. గతేడాది టాప్ 10లో ఉన్న భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. భారీగా ఆయన ఆస్తులు తగ్గి ఆ ప్లేస్ నుంచి మాయమైపోయాడు. 2025 జాబితా ప్రకారం ప్రపంచంలో 3,028 మంది బిలియనీర్లు ఉన్నారు. 2024 కంటే 247 మంది బిలియనీర్లు ఈఏడాది పెరిగారు. ఈ బిలియనీర్ల మొత్తం సంపద 16.1 ట్రిలియన్ డాలర్లు. ఇది 2024 కంటే దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు ఎక్కువ. 2025 ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో 902 మంది బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనాలో 516 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక భారతదేశం 205 మంది కుబేరులు ఉన్నారు. ఈ ఫోర్బ్స్ లిస్ట్‌లో ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన నికర ఆస్తుల విలువ 342 బిలియన్ల డాలర్లు. మెటా కంపెనీ ఓనర్ మార్క్ జుకర్‌బర్గ్ 216 బిలియన్ల డాలర్లు సంపదతో 2వ స్థానంలో ఉన్నాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 3వ ప్లేస్‌లో, ఒరాకిల్‌ యజమాని లారీ ఎల్లిసన్‌ నాల్గవ స్థానం దక్కించుకున్నారు.

Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?

Also read : Forbes Billionaires List 2025: 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?

ఇక భారత్ విషయానికి వస్తే.. గత సంవత్సరం టాప్ 10లో ఉన్న అంబానీ, ఇప్పుడు 92.5 బిలియన్ డాలర్ల నికర విలువతో జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు. అంబానీ నికర సంపద విలువ గత సంవత్సరం 116 బిలియన్ డాలర్లు ఉండగా.. 2025లో 92.5 బిలియన్ డాలర్లుకు పడిపోయింది, భార‌తీయ బిలియ‌నీర్ల మొత్తం ఆస్తుల విలువ 941 బిలియ‌న్ల డాల‌ర్లు. గ‌త ఏడాదితో పోలిస్తే ఇది త‌గ్గింది. మరో ఇండియన్ కుబేరుడు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 28వస్థానం దక్కించుకున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 56.3 బిలియన్ డాలర్లు. ఇండియాలో అత్యంత రిచెస్ట్ ఉమెన్‌గా సావిత్రి జిందాల్ నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆమె 56వ స్థానంలో ఉన్నారు. OP జిందాల్ గ్రూప్ ఓనర్‌గా ఆమెకు 35.5 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఆమె ప్రపంచంలోనే ఆరవ అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచింది.

Advertisment
Advertisment
Advertisment