/rtv/media/media_files/2025/03/23/gTTP3UpzSk1FOl7xKX52.jpg)
Canada PM Mark Carney
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరుగుదేశం కెనడాతో సుంకాల పేరుతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ,ట్రంప్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. అమెరికా అధ్యక్షుడే ట్రూత్ సోషల్ వేదికగాఈ విషయాన్ని వెల్లడించారు. నేను కార్నీతో ఫోన్ లో మాట్లాడాను.మా మధ్య మంచి సంభాషణ జరిగింది.
Also Read: AP Govt: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. వేతనం పెంపు.. ఎంతంటే?
చాలా విషయాలపై ఒక అంగీకారానికి వచ్చాం.కెనడా ఎన్నికలు ముగిసిన అనంతరం భేటీ అవుతాం. వాణిజ్యం, రాజకీయం వంటి పలు అంశాలపై చర్చిస్తాం. అది ఇరుదేశాలను గొప్పగా చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.ఈ ఫోన్ కాల్ పై కెనడా ప్రధాన కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏప్రిల్ 28న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి.
ట్రంప్ ఇప్పటికే కెనడా దిగుమతుల పై భారీగా టారిఫ్‌లు విధించగా..ఇటీవల వాహన దిగుమతుల పైన కూడా 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. దీని పై కార్నీ తీవ్రంగా స్పందించారు.ట్రంప్ టారిఫ్ ప్రకటన అనంతరం కార్నీ ఎన్నికల ప్రచారాన్నిఅర్థాంతరంగా ముగించుకొని క్యాబినెట్ సభ్యులతో సమావేశమయ్యారు. అమెరికాతో వాణిజ్య యుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా అమెరికా సుంకాలు అన్యాయమైనవని,ఈ చర్యతో ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు ఉన్న స్నేహబంధాన్ని ట్రంప్ శాశ్వతంగా మార్చేస్తున్నారని కార్నీ వ్యాఖ్యానించారు.ఆర్థిక వ్యవస్థ బలోపేతం, భద్రత,సైనిక సహకారం విషయంలో అమెరికా కెనడాల మధ్య ఉన్న పాతబంధం నేటితో ముగిసిపోయిందన్నారు. ఈ సుంకాలను ప్రతీకార వాణిజ్య చర్చలతోనే ఎదుర్కొంటామన్నారు.
ఏప్రిల్ 2 నుంచి అమెరికాకు దిగుమతయ్యే వాహనాలపై 25 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు.ఈ నిర్ణయం కెనడా ఆటో పరిశ్రమకుపెద్ద ఎదురుదెబ్చేనని విశ్లేషకులు భావిస్తున్నారు.దాదాపు 5 లక్షల ఉద్యోగాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు.
Also Read:Pastor Praveen Death Mistery: ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్.. షాకింగ్ అనుమానాలు!
Also Read: Mynmar Earth Quake: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి
america | trump | mark carney | canada | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates