/rtv/media/media_files/2025/03/23/gTTP3UpzSk1FOl7xKX52.jpg)
Canada PM Mark Carney
అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల పేరుతో పొరుగుదేశం కెనడాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తుల పై భారీగా టారిఫ్‌లు విధించగా...తాజాగా వాహన దిగుమతుల పైనా 25 శాతం సుంకాన్ని ప్రకటించారు.దీని పై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు.ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య ఉన్న పాత బంధం ముగిసిపోయిందన్నారు.
Also Read: Elon Musk: ఫెడరల్ HRలో ట్రంప్ విధేయులు.. ఒత్తిడిలో ఉద్యోగులు...అంతా మస్క్ పుణ్యమేనా!
ట్రంప్ టారిఫ్ ప్రకటనతో తన ఎన్నికల ప్రచారాన్ని అర్థాంతరంగా ముగించుకొని మార్క్ కార్నీ..ఒట్టావాకు తిరిగొచ్చి కేబినెట్ సభ్యులతో హుటాహుటిన సమావేశమయ్యారు.అమెరికాతో వాణిజ్య యుద్ధంలో అనుసరించాల్సిన హ్యూహాలపై చర్చలు జరిపారు.
Also Read: Russia-Ukrain War: ఉక్రెయిన్ ప్రభుత్వం మారితే కనుక.. యుద్దాన్ని ఆపేస్తాం!
Old Relationship Between America - Canada Is Over
ట్రంప్ సుంకాలు అన్యాయమైనవి. ఈ చర్యలతో ఇరుదేశాల మధ్య ఇప్పటి వరకు ఉన్న స్నేహబంధాన్ని ట్రంప్ శాశ్వతంగా మార్చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం , భద్రత,సైనిక సహకారం విషయంలో అమెరికా -కెనడా మధ్య ఉన్న పాతబంధంం నేటితో ముగిసిపోయింది.అమెరికా విధిస్తున్న ఈ సుంకాలను మేం ప్రతీకార వాణిజ్య చర్యలతోనే ఎదుర్కొంటాం.
ఆ నిర్ణయాలు అగ్రరాజ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయి. మా దేశాన్ని రక్షించుకోవడం కోసమే. ఈ టారిఫ్ లకు మేం ప్రతీకార చర్యలు తీసుకుంటున్నామని కెనడా ప్రధాని వెల్లడించారు. ఏప్రిల్ 3 నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వాహనాల పై 25 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం కెనడా ఆటో పరిశ్రము పెద్ద ఎదురుదెబ్బేనని అంతా అనుకుంటున్నారు.
దీంతో కెనడా సర్కారు తీవ్రంగాస్పందించింది. ఇది తమ కార్మికుల పై ప్రత్యక్ష దాడి అని అభివర్ణించిన మార్క్ కార్నీ..అగ్రరాజ్యం పై త్వరలో ప్రతీకార సుంకాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. దేశీయ తయారీని వేగవంతం చేసేందుకు ఈ సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.అయితే విడిభాగాలు,తయారీ కోసం అంతర్జాతీయ సరఫరా పై ఆధారపడిన అమెరికా వాహన కంపెనీలకు తాజా పరిణామం ఆర్థిక భారం అవుతుందన్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Also Read: UAE: యూఏఈ జైళ్ల నుంచి 500 మందికి పైగా భారతీయుల విడుదల!
latest telugu news updates | latest-telugu-news | canada-pm | mark carney | donald-trump | today-news-in-telugu | international news in telugu