SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్

SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్‌లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్‌, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు.

New Update
SRH mems

SRH mems Photograph: (SRH mems)

ఐపీఎల్ రెండవ రోజు సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ టీంలు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తలపడుతున్నాయి.  టాస్ ఓడిపోయ సన్ రైజర్స్ బ్యాటింగ్‌కు పరిమితమైంది. గ్రీస్‌లోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఆరు వికెట్లు కోల్పొయి 287 పరుగులు చేసింది. ఐపీఎల్‌లోనే ఇది ఆల్ టైం హైయెస్ట్ స్కోర్. ఈ స్కోర్ గతంలో హైదరబాద్ సన్ రైజర్స్‌ టీమే చేసింది. దీంతో SRH ప్లేయర్స్ బ్యాటింగ్‌, రికార్డ్‌ను ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ SRH టీం ఓపెనింగ్ మ్యాచ్‌ను ఫ్యాన్స్ వైల్డ్ ఫైర్ అన్నట్లు జరుపుకుంటున్నారు ఆన్‌లైన్‌లో. దానికితోటు ప్లేయర్ల బ్యాటింగ్ కూడా అదే లెవల్‌లో ఉంది. రాజస్థాన్ రాయల్స్‌ను టార్గెట్‌గా చేసి SRH ఫ్యాన్స్ క్రియేట్ చేసిన మీమ్స్, ట్రోల్స్ కొన్ని చూద్దాం..

రావడంతోనే రచ్చ లేపిన SRH టీం..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KKR VS SRH: మరీ ఇంత దారుణంగానా..ఎస్ఆర్హెచ్ కు ఏమైంది?

ఐపీఎల్ లో ఈరోజు జరిగిన కోలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ దారుణంగా ఓడిపోయింది. 80 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ కు హ్యాట్రిక్ ఓటమి వచ్చినట్టయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

KKR VS SRH

అందరూ పెద్ద పెద్ద ప్లేయర్లు. భారీ అంచనాలు...కానీ ఏం లాభం..హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం మ్యాచ్ లు గెలవలేకపోతోంది. వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములను తన ఖాతాలో వేసుకుంది. ఈరోజు కోలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ ఒక్కడే 33 పరుగుల టాప్ స్కోరర్ గా నిలిచాడు అంటే అర్ధం చేసుకోవచ్చు...ఆ జట్టులో బ్యాటర్లు ఎంత ఘోరంగా విఫలం అయ్యారో. మెండిస్ 20 బంతుల్లో 27 పరుగులు చేసాడు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్లకే టపాటపా పడిపోయారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనే ఈరోజు చేతులెత్తేసింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 3, వరుణ్‌ చక్రవర్తి 3, రస్సెల్‌ 2, హర్షిత్‌ రాణా, సునిల్‌ నరైన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. హైదరాబాద్ ఇలానే ఆడితే గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టడం ఖాయం.

హోమ్ గ్రౌండ్ లో దుళ్ళగొట్టిన కేకేఆర్..

ఈరోజు కేకేఆర్ తన హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతోంది. ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ వెర్స్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అవుతోంది. టాస్ ఓడిన కోలకత్తా మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ కు 201 పరుగుల భారీ లక్ష్యం వచ్చింది. కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ చివరి ఓవర్లలో అదరగొట్టాడు. చాలా వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. కేవలం 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి 29 బంతుల్లో 3 సిక్స్ లు, ఏడు ఫోర్లతో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

మరోవైపు ఇదే జట్టులో రఘువంశీ కూడా 32 బంతుల్లో హాఫ్ సెంజరీ చేశాడు. అలాగే కెప్టెన్‌ అజింక్య రహానే 38; 27 బంతుల్లో 4 సిక్సులు, ఒక ఫోర్‌, రింకుసింగ్‌ 32*; 17 బంతుల్లో ఒక సిక్స్‌, నాలుగు ఫోర్లు కొట్టి ఎస్ఆర్ హెచ్ కు మంచి టార్గెట్ ను ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. డికాక్, నరైన్ లు మాత్రం నిరాశపర్చారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో షమీ, కమిన్స్‌, జీషన్‌ అన్సారీ, హర్షల్‌ పటేల్‌, కమిందు మెండిస్‌ తలో వికెట్‌ తీశారు.

 today-latest-news-in-telugu | IPL 2025 | kkr-vs-srh | match

Also Read: HCU: కంచ గచ్చిబౌలీ వివాదం..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment