Iran-US War: అమెరికాతో మళ్లీ యుద్ధం.. ఇరాన్ సంచలన ప్రకటన
అమెరికాతో నెలకొన్న ఘర్షణపై తాజాగా ఇరాన్ సైనిధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.
అమెరికాతో నెలకొన్న ఘర్షణపై తాజాగా ఇరాన్ సైనిధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.
పలు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎం (EVM), వీవీప్యాట్ యంత్రాలను తరలించే కేంద్రమే స్ట్రాంగ్ రూమ్.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయా? నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అధికారం చేపట్టబోతోందా? అంటే.. మాజీ ఐపీఎస్ అధికారి రవి నిర్వహించిన తాజా 'పోస్ట్-ఎగ్జిట్ పోల్' సర్వే ఫలితాలు "అవును" అనే సమాధానం ఇస్తున్నాయి.
ఇన్స్టాగ్రామ్ వేదికగా సాగుతున్న వలపు వలను జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆకర్షణీయమైన ఫోటోలు, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తూ యువతులను వంచించే ఓ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు, నిందితుల అరాచకాలను వెలుగులోకి తెచ్చారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ కేంద్రాల్లో పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదంటూ టీఎంసీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ దౌత్యం, సైనిక వ్యూహాల్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యానికి అత్యంత సన్నిహిత మిత్రదేశంగా భావించే జర్మనీ నుండి సుమారు 5,000 మంది అమెరికా సైనికులను వెనక్కి రప్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నాడు ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమ పేరుతో వంచించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతి, స్టేషన్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ఈ మార్గంలో కొత్త సముద్ర నిబంధనలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.