Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని ఆయన సంకేతాలిచ్చారు. వెనిజులా దండయాత్ర తర్వాత, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో హవానాను (క్యూబా రాజధాని) "స్నేహపూర్వక స్వాధీనం" చేసుకునే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం క్యూబా ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలపై ఆంక్షలను విస్తరిస్తూ ఆయన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు (Executive Order) పై సంతకం చేశారు.
ఫ్లోరిడాలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, "క్యూబా అనే ప్రాంతం ఉంది, దాన్ని మనం దాదాపు వెంటనే స్వాధీనం చేసుకోబోతున్నాం. ప్రస్తుతం క్యూబా సమస్యల్లో ఉంది.. అయితే ముందుగా ఒక పనిని (ఇరాన్ యుద్ధాన్ని) పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను" అని చమత్కరించారు. ఇరాన్ నుండి తిరిగి వచ్చే దారిలో ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమాన వాహక నౌక అయిన 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్'ను క్యూబా తీరానికి కేవలం 100 గజాల దూరంలో నిలుపుతామని, అప్పుడు వారు వెంటనే లొంగిపోతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా క్యూబా ప్రభుత్వం వల్ల అమెరికా జాతీయ భద్రతకు "అసాధారణమైన ముప్పు" పొంచి ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. కమ్యూనిస్ట్ క్యూబా పాలన, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం,ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతోందని అమెరికా ఆరోపిస్తోంది. కొత్తగా విధించిన ఆంక్షలు క్యూబా భద్రతా యంత్రాంగానికి మద్దతు ఇచ్చే వ్యక్తులను, అవినీతికి పాల్పడే అధికారులను ,మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులైన వారిని లక్ష్యంగా చేసుకున్నాయి.
వెనిజులాలో అధికార మార్పిడి తర్వాత, ఇప్పుడు క్యూబాపై ఒత్తిడి పెంచడం ద్వారా లాటిన్ అమెరికాలో కమ్యూనిస్ట్ ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు వస్తున్న తరుణంలో, అమెరికా నావికాదళాన్ని కరీబియన్ దీవుల వైపు మళ్లించడం ద్వారా క్యూబాను లొంగదీసుకోవచ్చని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
Donald Trump : క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటాం..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని ఆయన సంకేతాలిచ్చారు.
Donald Trump