Donald Trump : క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటాం..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని ఆయన సంకేతాలిచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని ఆయన సంకేతాలిచ్చారు.
అమెరికా తీసుకున్న నిర్ణయాలు క్యూబాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం అక్కడ 10 నుంచి 20 గంటలకు పైగా విద్యుత్ కోతలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యూబాను తమ కంట్రోల్లోకి తీసుకుంటామని అన్నారు. ఆ దేశంలో ప్రస్తుతం విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి తరుణంలో ఆయన ఇలా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల తర్వాత ఇప్పుడు ట్రంప్ కన్ను క్యూబాపై పడింది. "క్యూబా ప్రభుత్వంతో మేము చర్చలు జరుపుతున్నాం.. బహుశా మేము క్యూబాను 'ఫ్రెండ్లీ టేకోవర్' చేసుకునే అవకాశం ఉంది" అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి.