Donald Trump : ఇరాన్‌ను వదిలేసి.. ఇక క్యూబాపై ఫోకస్ ! ట్రంప్ వ్యూహం వెనుక అసలు కథ ఇదేనా?

పశ్చిమాసియా (ప్రాచ్య దేశాల) సంక్షోభం ఎంతకీ ముగింపునకు రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విదేశాంగ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. ఇరాన్ ను వదిలి అమెరికాకు చాలా కాలంగా కొరకరాని కొయ్యగా మారిన క్యూబాపై ట్రంప్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

New Update
FotoJet - 2026-05-22T150506.563

Trump Shifts Focus from Iran to Cuba

Donald Trump : పశ్చిమాసియా (ప్రాచ్య దేశాల) సంక్షోభం ఎంతకీ ముగింపునకు రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విదేశాంగ వ్యూహాన్ని మార్చుకుంటున్నారా? ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమార్చినా, అమెరికా భీకర దాడులతో ఆ దేశాన్ని కకావికలం చేసినా ఇరాన్ ఏమాత్రం లొంగిరాకపోవడంతో ట్రంప్ పునరాలోచనలో పడ్డారా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. ఇరాన్‌పై యుద్ధాన్ని పక్కనబెట్టి, అమెరికాకు చాలా కాలంగా కొరకరాని కొయ్యగా మారిన క్యూబాపై ట్రంప్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవలి పరిణామాలు, అమెరికా మీడియా కథనాలు, స్వయంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయి.

క్యూబా చుట్టూ ఉచ్చు.. ట్రంప్ దూకుడు!

క్యూబా స్వాతంత్ర్య దినోత్సవమైన మే 20 (బుధవారం) నాడే అమెరికా తన అసలు రంగును బయటపెట్టింది. క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోను 'అమెరికా ప్రజలను చంపిన నేరస్తుడు'గా యూఎస్ న్యాయశాఖ ప్రకటించింది.కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, రంగంలోకి సైన్యాన్ని కూడా దింపింది.అమెరికా సెంట్రల్ కమాండ్ క్యూబాకు అతిసమీపంలోకి మూడు అత్యాధునిక యుద్ధనౌకలను పంపింది."క్యూబా విషయంలో గత అమెరికా అధ్యక్షులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. కానీ అక్కడ ఏదైనా మార్పు చేయగలిగేది నేనొక్కడినే" అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ ‘పొలిటికో’ కథనం ప్రకారం.. క్యూబాపై సైనిక చర్యకు అమెరికా రక్షణ వర్గాలు సర్వం సిద్ధం చేస్తున్నాయి. గతంలో వెనెజువెలా అధ్యక్షుడు మదురోను నాటకీయంగా పట్టుకొచ్చినట్టే, క్యూబాలోని కీలక నేతలను అరెస్టు చేసి, అక్కడ ప్రభుత్వాన్ని మార్చాలని ట్రంప్ భావిస్తున్నారు. దీని ద్వారా తన విదేశాంగ విధానంలో ఒక చారిత్రాత్మక విజయం సాధించానని అమెరికా ప్రజలకు చూపించుకోవాలనేది ట్రంప్ ప్లాన్. అవసరమైతే భూతల దాడులకు (Ground Invasion) కూడా సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఇప్పటికే సంకేతాలు వెళ్లినట్లు సమాచారం.

ఇరాన్ విషయంలో ట్రంప్ వర్సెస్ నెతన్యాహు?

మరోవైపు, ఇరాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మధ్య తీవ్ర విభేదాలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపి పరిష్కారం వెతుకుదామని ట్రంప్ ప్రతిపాదించగా, నెతన్యాహు మాత్రం దాడులు కొనసాగించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ విషయమై బుధవారం వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అత్యంత వాడీవేడిగా సాగిందని ‘యాక్సియోస్’ వార్తాసంస్థ వెల్లడించింది.

 ఇరాన్‌తో అమెరికా మొదటి విడత చర్చలు జరిపినప్పుడే నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ట్రంప్‌తో జరిగిన ఫోన్ కాల్ తర్వాత ఆయన మరింత ఆందోళన చెందుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.ఇరాన్ పట్టుదలకు పోతుండటం, సొంత మిత్రదేశమైన ఇజ్రాయెల్‌తో విభేదాలు రావడం వల్లే ట్రంప్ తన ఫోకస్‌ను ఇరాన్ నుంచి క్యూబా వైపు తిప్పినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

#America into Israel-Iran war #america next target Cuba #Iran War #cuba #Donald Trump Attack On Cuba #america cuba war
Advertisment
తాజా కథనాలు