BIG BREAKING: డీఎంకేకు బిగ్ షాక్.. వెనుకంజలో స్టాలిన్
తమిళనాడులో డీఎంకేకు బిగ్ షాక్ తగిలింది.ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కంచుకోట అయిన కొలత్తూరు స్థానంలో వెనుకబడి ఉన్నారు. కొలత్తూరులో టీవీకే వీఎస్‌బాబు ఆధిక్యంలో ఉన్నారు.
తమిళనాడులో డీఎంకేకు బిగ్ షాక్ తగిలింది.ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కంచుకోట అయిన కొలత్తూరు స్థానంలో వెనుకబడి ఉన్నారు. కొలత్తూరులో టీవీకే వీఎస్‌బాబు ఆధిక్యంలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఊపిరి బిగబట్టేలా చేస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, అధికార టీఎంసీ (TMC), బీజేపీల మధ్య పోరు ఫోటో ఫినిష్ను తలపిస్తోంది. టీఎంసీ 98, బీజేపీ 95 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి.
ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. వెస్ట్ బెంగాల్‌లోని తొలి ట్రెండ్లు బీజేపీ, టీఎంసీల మధ్య హోరాహోరీ పోరును సూచిస్తున్నాయి.
సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే, ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం స్థానాల్లో సగానికంటే ఎక్కువ (50% + 1) స్థానాలను గెలవాల్సి ఉంటుంది. దీనినే 'మ్యాజిక్ ఫిగర్' అంటారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.
ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. తొలి ట్రెండ్లు తమిళనాడు నుంచి వెలువడ్డాయి
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత EVM ఓట్లు లెక్కిస్తారు.మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై, యావత్ రాష్ట్రం ఉత్కంఠతో ఊగిపోతున్న వేళ, ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరందుకోవడంతో రాజధాని చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు.
దేశ రాజకీయ యవనికపై అత్యంత ఆసక్తి రేకెత్తించిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం (పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి) ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.