/rtv/media/media_files/2026/05/01/mamatha-2026-05-01-06-37-57.jpg)
mamata
Assembly Election Results 2026 :ఎన్నికల ఫలితాల సరళి దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. బెంగాల్‌లో నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న పోరు, తమిళనాడులో స్టాలిన్ హవా కొనసాగుతోంది.
బెంగాల్‌లో హై-డ్రామా..మమత వెనుకంజ.. నివాసం మార్పు!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఊపిరి బిగబట్టేలా చేస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, అధికార టీఎంసీ (TMC), బీజేపీల మధ్య పోరు ఫోటో ఫినిష్‌ను తలపిస్తోంది. మొత్తం స్థానాల్లో టీఎంసీ 98, బీజేపీ 95 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అత్యంత కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.మరోవైపు భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనుకంజలో ఉండటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇదే సమయంలో ఆమె తన అధికారిక నివాసాన్ని వీడి, సొంతింటికి బయలుదేరడం బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
తమిళనాడు: స్టాలిన్ దూకుడు.. పుంజుకోని విజయ్ 'TVK'!
తమిళనాడులో డీఎంకే (DMK) తన పట్టును నిరూపించుకుంటోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో అధికార కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) ఈ ఎన్నికల్లో పెను మార్పులు తెస్తుందని భావించినప్పటికీ, ఇప్పటివరకు వెలువడిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఆ పార్టీ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. దాదాపు అన్ని చోట్లా డీఎంకే కూటమే ముందంజలో ఉంది.
పుదుచ్చేరిలో కమల వికాసం!
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో బీజేపీ తన జోరును ప్రదర్శిస్తోంది.ప్రారంభంలో లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. స్థానిక సమీకరణాలు బీజేపీకి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
Follow Us