/rtv/media/media_files/2026/05/04/tmc-2026-05-04-08-47-11.jpg)
ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. బెంగాల్‌లో 162 స్థానాలకు ట్రెండ్స్ వెలువడగా, వాటిలో 88 స్థానాల్లో బీజేపీ, 72 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉన్నాయి. అస్సాంలో 126 స్థానాలకు గాను 54 స్థానాలకు ట్రెండ్స్ వెలువడగా, వాటిలో 44 స్థానాల్లో బీజేపీ, 10 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. కేరళలో 140 స్థానాలకు గాను 27 స్థానాలకు ట్రెండ్స్ వెలువడగా, వాటిలో 15 స్థానాల్లో యూడీఎఫ్, ఐదేసి స్థానాల్లో ఎల్డీఎఫ్, బీజేపీలు ఆధిక్యంలో ఉన్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తొలి ట్రెండ్స్ ప్రకారం, డీఎంకే 18 స్థానాల్లో, ఏఐఏడీఎంకే 8 స్థానాల్లో, విజయ్ టీవీకే 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అదేవిధంగా, కేరళలో కూడా ఒక స్థానంలో ట్రెండ్‌లు వెలువడ్డాయి, అక్కడ యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. విజయ్ పోటీ చేసిన పెరంబూర్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. త్రిచి ఈస్ట్ నియోజకవర్గంలో మాత్రం విజయ్ వెనుకబడి ఉన్నారు.
- తమిళనాడులో 234 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 118
- పుదుచ్చేరిలో 30 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 16
- అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 64
- పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 148
- కేరళలో 140 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 71
Follow Us