Trisha : విజయ్ కోసం తిరుమలలో త్రిష పూజలు..వైరల్ వీడియోలు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై, యావత్ రాష్ట్రం ఉత్కంఠతో ఊగిపోతున్న వేళ, ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

New Update
vijay

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై, యావత్ రాష్ట్రం ఉత్కంఠతో ఊగిపోతున్న వేళ, ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన 43వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె ఆదివారం రాత్రి తిరుపతికి ప్రయాణిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, సోమవారం ఉదయం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా అత్యంత నిరాడంబరంగా సాగిన ఈ ఆధ్యాత్మిక పర్యటన, రాజకీయ వర్గాల్లో మాత్రం సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది.

ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీవీకే పార్టీకి

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అనూహ్య రీతిలో వెలుగులోకి రావడంతో, త్రిష పర్యటనకు రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీవీకే పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్న తరుణంలో, విజయ్ పార్టీ విజయం సాధించాలని కోరుకుంటూనే ఆమె ఈ మొక్కులు చెల్లించుకున్నారనే వార్తలు ట్విట్టర్ వేదికగా హల్చల్ చేస్తున్నాయి. త్రిష తన పుట్టినరోజు వేడుకల కన్నా ఎక్కువగా, తన సన్నిహిత మిత్రుడు విజయ్ రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ సమయంలో తిరుమలకు వచ్చారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కింది. ఎన్నికల ఫలితాల అనంతరం టీవీకే పార్టీ తన ఉనికిని చాటుకుంటుందని అంచనాలు వెలువడుతుండటంతో, ఇతర పార్టీల నుంచి రాగలిగే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు,  తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నాయకత్వం అప్రమత్తమైంది. ఫలితాలకు ముందే రిసార్ట్ పాలిటిక్స్ ఛాయలు కనిపిస్తుండటం తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య త్రిష తిరుపతి సందర్శన కేవలం పుట్టినరోజు మొక్కు మాత్రమేనా లేక విజయ్ రాజకీయ ప్రస్థానానికి వెన్నుదన్నుగా నిలిచే ఆధ్యాత్మిక వ్యూహమా అన్నది చర్చనీయాంశంగా మారింది.Tri