/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-07-17-11.jpg)
Assembly Election Results-2026 : పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై టీఎంపీ, సీపీఐ(ఎం) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అవి మాక్ పోల్ స్లిప్పులని ఈసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ నాయకులు వినకపోవడంతో ఘటనపై ఈసీ చారణకు ఆదేశించింది. మమత పోటీ చేస్తున్న భవానీపూర్‌లోని కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆందోళన నెలకొంది.TMC, బీజేపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దు మణిగింది.
పశ్చిమబెంగాల్‌లో కౌంటింగ్ ప్రారంభమైన తొలి అరగంటలో తృణమూల్ కాంగ్రెస్ 24 స్థానాల్లో, బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తున్నాయి,
తమిళనాడులో అధికార డీఎంకే 11 స్థానాల్లో ముందుండగా. అన్నాడీఎంకే 5 స్థానాల్లో, టీవీకే 1 స్థానంలో ఆధిక్యం లో ఉన్నాయి.
కేరళలో ఎల్‌డీఎఫ్ 30 స్థానాల్లో, యూడీఎఫ్ 46 స్థానాల్లో, ఎన్డీఏ 3 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి.
అస్సాంలో బీజేపీ 12 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 4 స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తున్నాయి.
పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Follow Us