Elections Results 2026 : దూసుకుపోతున్న విజయ్ పార్టీ..  27 స్థానాల్లో ఆధిక్యం

నటుడు విజయ్ కొత్త పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు కొలత్తూరులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెనుకబడ్డారు. ఆయనపై పోటీలో నిలిచిన  టీవీకే అభ్యర్థి వీఎస్‌బాబు ఆధిక్యంలో ఉన్నారు.

New Update
TVK Vijay

TVK Vijay

నటుడు విజయ్ కొత్త పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు కొలత్తూరులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెనుకబడ్డారు. ఆయనపై పోటీలో నిలిచిన  టీవీకే అభ్యర్థి వీఎస్‌బాబు ఆధిక్యంలో ఉన్నారు.అయితే స్టాలిన్ పార్టీ డీఎంకే తమిళనాడులో 50కి పైగా సీట్లతో ఆధిక్యంలో ఉంది. ఎడప్పాడి పళనిస్వామి తన కంచుకోట అయిన ఎడప్పాడి స్థానంలో వెనుకబడి ఉన్నారు.  తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు అద్భుతమైన ఉత్సాహాన్ని కనబరిచారు. ఓటింగ్ శాతం 85.14కు చేరి, గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అక్కడ అధికారంలో ఉంది. 

Advertisment
తాజా కథనాలు