TVK VIJAY HOME SECUIRITY : చెన్నైలో హై అలర్ట్..విజయ్‌ ఇంటివద్ద భారీగా పోలీసులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరందుకోవడంతో రాజధాని చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు.

New Update
FotoJet - 2026-05-04T073302.894

Heavy police presence at Vijay's house

TVK VIJAY HOME SECUIRITY :  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరందుకోవడంతో రాజధాని చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా విజయ్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.విజయ్ నివాసం ఉండే నీలాంగరై ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతం వైపు వెళ్లే దారులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. విజయ్ ఇంటికి వెళ్లే ప్రధాన రహదారుల వద్ద ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.

ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఉద్వేగభరిత వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నందున, ఎలాంటి అల్లర్లు లేదా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మొత్తం 233 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటింది. ఇందులో భాగంగా విజయ్ స్వయంగా తిరుచ్చి ఈస్ట్ ,పెరంబూర్ అనే రెండు నియోజకవర్గాల నుండి బరిలోకి దిగారు. ఆయన గెలుపుపై అభిమానులు, రాజకీయ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే ద్విముఖ పోరాటానికి తెరదించుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం (TVK) భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని పలు సర్వేలు విశ్లేషించాయి.ప్రముఖ సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం.. తమిళనాడులో విజయ్ మేజిక్ పనిచేసినట్లు కనిపిస్తోంది. మొత్తం 234 స్థానాలకు గాను TVK 98-120 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని పేర్కొంది.ప్రస్తుత అధికార పార్టీ డీఎంకే (DMK) 92-100 స్థానాలతో రెండో స్థానానికి పరిమితం కావచ్చు.రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో, విజయ్ కింగ్ మేకర్ మాత్రమే కాదు, కింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని ఈ సర్వే సూచించింది.

 మరోవైపు టుడేస్ చాణక్య సర్వే ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. ఈ సంస్థ డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది.DMK కూటమి 114-136 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్‌ను దాటే అవకాశం ఉంది.TVK (విజయ్)  తొలి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ 52 నుంచి 74 స్థానాలు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరచనుందని తెలిపింది.  ఈ సర్వే ప్రకారం ప్రతిపక్ష AIADMK-BJP కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలి కేవలం 34-56 స్థానాలకే పరిమితమై మూడో స్థానానికి పడిపోయే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు