/rtv/media/media_files/2025/03/06/DF6hRRYaICEck1jArFqL.jpg)
mumbai Photograph: (mumbai )
U Thackeray: ఆర్ఎస్ఎస్ నేత సురేష్ భయ్యాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. భయ్యాజీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబైని లాక్కునేందుకు గుజరాతీలు కుట్ర చేస్తున్నారని ఠాక్రే ఆరోపించారు.
మరాఠీ మాట్లాడాల్సిన అవసరం లేదు..
ఈ మేరకు ముంబైలో ఉండాలంటే మరాఠీ మాట్లాడాల్సిన అవసరం లేదన్న భయ్యాజీకి మాటల వేకన కుట్ర దాగివుందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి ఘాట్‌కోపర్‌లో అధికార భాష గుజరాతీనే అని వాదిస్తున్నాయన్నారు. ముంబై నగరాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకోవాలని, కుదిరితే లాక్కునేందుకు గుజరాతీలు కుట్ర చేస్తున్నారంటూ ఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాతోనే ముంబైపై కామెంట్స్ చేస్తున్నరని మండిపడ్డారు.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
ఇదిలా ఉంటే.. మార్చి 21, 22, 23 తేదీల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభను బెంగళూరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను గతేడాది నాగ్‌పూర్‌లో నిర్వహించారు. అయితే ఈ ఏడాది బెంగళూరు వేదిక కానుంది. ఈ సభలో 2024-25 కార్యకలాపాల నివేదికను ప్రతిపాదించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల విశ్లేషణతో పాటు భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించనున్నారు. ఈ సభపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చూడండి: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..