/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-13-45-41.jpg)
There's a son..here's a daughter...a stroke of inheritance for fathers
Political Stroke : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్ ఓటమి పాలవ్వడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాగా తమిళనాడులో డీఎంకే పార్టీ(dmk-party), ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం ఆయన కొడుకు ఉదయనిధి కారణాంగానే ఆ పార్టీ అపజయం పాలయిందనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడి పోవడానికి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురే కారణమని ప్రచారం సాగుతోంది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..
తెలంగాణలో బీఆర్‌ఎస్
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ (BRS Party) గ్రాఫ్ తగ్గడానికి, కేసీఆర్ ఇమేజ్‌పై ప్రభావం పడటానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. కేసీఆర్ కూతురు, మాజీ ఎమ్మెల్సీ అయిన కవిత(kalvakuntla-kavitha) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కేసీఆర్‌ను దెబ్బ కొట్టలేక కవితను పావుగా వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కవితను విచారించడం, అరెస్ట్ చేయడం వంటి కారణాలు బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ (ED) , సీబీఐ (CBI) విచారించడం, ఆపై అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఒక రకంగా ఇది కేసీఆర్ కుటుంబంపై నేరుగా జరిగిన రాజకీయ దాడిగా బీఆర్ఎస్ భావించింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకున్నాయి. "లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రయత్ని్స్తున్నారు. " అంటూ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. తెలంగాణ ఉద్యమ నేతగా, ఒక క్లీన్ ఇమేజ్‌తో ఉన్న కేసీఆర్ కు, తన కుటుంబ సభ్యులే ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ఇది పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని కూడా కొంత మేర దెబ్బతీసింది. మోదీ సర్కార్ అవినీతి రహిత పాలన అనే నినాదంతో ముందుకు వెళ్తూ, ఈ కేసు ద్వారా బిఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేయగలిగింది. కేసీఆర్ ప్రస్తుతం ఈ ఒత్తిడి నుండి పార్టీని బయటపడేసి, మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read : హైదరాబాద్‌లో కారు డ్రైవర్ రాక్షసత్వం... బానెట్‌పై బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లిన వైనం
తమిళనాడులో డీఎంకే
తమిళనాడు(tamilanadu) రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అధికార డీఎంకే (DMK) పార్టీ పతనం దిశగా సాగుతోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సహా దాదాపు 28 మంది మంత్రులు వెనుకంజలో ఉండటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికార పీఠం వైపు అడుగులు వేస్తోంది. నిజానికి డీఎంకే విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పినప్పటికీ అవేవి నిజం కాలేదు.
ఈ ఘోర పరాజయానికి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) గతంలో చేసిన 'సనాతన ధర్మ' వ్యతిరేక వ్యాఖ్యలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులతో పోల్చడం, దానిని నిర్మూలించాలని పిలుపునివ్వడం హిందూ ఓటర్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా మార్చుకున్నాయి. ఆధ్యాత్మిక భావాలు ఉన్న ఓటర్లను డీఎంకేకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకురావడంలో అవి సఫలమయ్యాయి.
రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన భావాలను దెబ్బతీయడం వల్ల కేవలం గ్రామీణ ప్రాంతాలే కాకుండా, పట్టణాల్లోని విద్యావంతులైన ఓటర్లు కూడా డీఎంకేకు దూరమయ్యారు. సనాతన ధర్మంపై ఉదయనిధి(CM Stalin) చేసిన వ్యాఖ్యలు వికటించడంతో సంప్రదాయ ఓటు బ్యాంకు, హిందూ సమాజం డీఎంకేకు గట్టి షాక్ ఇచ్చింది.హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం, పరిపాలనపై అసంతృప్తి వెరసి డీఎంకేను పతనం అంచున నిలబెట్టాయని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు, కొత్త ప్రత్యామ్నాయంగా వచ్చిన టీవీకే వైపు ప్రజలు మొగ్గు చూపడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలుకుతోంది. 'సనాతన' వ్యతిరేక రాజకీయం ఉదయనిధికి,ఆయన పార్టీకి పెను శాపంగా మారిందని స్పష్టమవుతోంది.
Follow Us